శ్రీకాకుళం పట్టణంలో రేపటి నుండి సెల్ఫ్ లాక్ డౌన్ విధిస్తున్నారు. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వ్యాపార వర్గాలు ఈ మేరకు సెల్ఫ్ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే వ్యాపార దుకాణాలకు అనుమతి ఉంటుంది. సాయంత్రం 6 తర్వాత నిత్యావసరాలు మినహా అన్ని వ్యాపారాలు బంద్ చేయనున్నారు. సినిమా థియేటర్లలో రేపటి నుంచి రోజుకు రెండు ఆటలు ఆడించనున్నారు. మార్నింగ్ షో, మ్యాట్ని షోల వరకు సినిమా హాళ్లకు పరిమితం చేసేందుకు థియేటర్లు యాజమాన్యం ముందుకు వచ్చాయి

. ఇక శ్రీకాకుళం టౌన్ సండే పూర్తిగా లాక్ డౌన్ పై నిర్ణయాన్ని వ్యాపార వర్గాలకు జిల్లా కలెక్టర్ వదిలేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ కేసుల కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని శ్రీకాకుళం టౌన్ , పలాస , రాజాం ,పాలకొండ , నరసన్నపేట , గారలో వ్యాప్తి ఎక్కువగా ఉందని అన్నారు. 

శ్రీకాకుళం పట్టణంలో కేసుల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటామన్న ఆయన వ్యాపారస్తులు సహకరించేందుకు ముందుకు వచ్చారని అన్నారు. జిల్లాలో హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత లేదు ... వెయ్యి బెడ్లు అందుబాటులో ఉన్నాయని రెమిడెసివర్ ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే సప్లై ఉందని అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు వారం రోజుల్లోపు రెమిడెసివర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంటాయన్న ఆయన ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. ప్రతి 24 గంటలకు ప్రత్యేకంగా ట్యాంకర్ సాయంతో హాస్పిటల్ లోని ఆక్సిజన్ ట్యాంకులను నింపుతున్నామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: