మనిషి సంఘ జీవి. నలుగురితో కలసి ఉండడమే మనిషికి ఆనందం కలిగిస్తుంది. ఎన్ని ఉన్నా కూడా తోటి మనిషి కనిపించకపోతే బెంగటిల్లుతాడు. డీలా పడతాడు. అటువంటి మనిషి మీద, మొత్తం జీవన విధానం మీద అతి పెద్ద దెబ్బ పడిపోయింది.

కరోనా మహమ్మారి మనిషి మూలాలకే సవాల్ చేసింది. నలుగురితో కలవరాదు. దూరం పాటించాలి. ఒంటరిగా ఉంటే మేలు. ఇలా ఎన్నో నిబంధనలు కరోనా తో వచ్చేశాయి. యూరోపియన్ దేశాలలో అయితే  కరోనా మొదటి దశ చాలా భయంకరంగా గడచింది. అది తగ్గింది అనుకుంటే రెండవ దశ కూడా వీర విహారం చేసింది. దాంతో పెద్ద ఎత్తున మానవ హననం అక్కడ జరిగిపోయింది. మారణ హోమంతో బీభత్సమే సృష్టించింది.

అలాంటి దేశాలలో యునైటెడ్ కింగ్ డమ్ కూడా ఒకటి. గత ఏడాది సెప్టెంబర్ లో కనుక యునైటెడ్ కింగ్ డమ్ ని చూస్తే బతికి బట్టగలరా అని అంతా భావించారు. కానీ ఇపుడు పూర్తిగా సాధారణ పరిస్థితికి వచ్చేశారు. అక్కడ అంతా చాలా సాదాసీదా వాతావరణం ఏర్పడింది. దాంతో  పాటు వ్యాక్సినేషన్ కూడా పెద్ద ఎత్తున చేయడంతో కరోనా మహమ్మారి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. మరణాలు కూడా తగ్గాయి.

ఈ నేపధ్యంలో చాలా సడలింపులను అక్కడ ఇచ్చేశారు. ఈ నెల 17 నుంచి కౌగిలింతలకు కూడా అక్కడ ఓకే అంటున్నారు. అయితే అది ఇళ్ళలోని వేడుకలు. విందులకు మాత్రమే. బయటకు వచ్చినపుడు మాత్రం భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. అదే విధంగా పబ్ లు రెస్టారెంటకు కూడా హ్యాపీగా వెళ్లవచ్చు అని కూడా చెప్పేశారు. అక్కడ కూడా కాస్తా భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.  జనాలు సినిమా హాళ్ళలో కలవవచ్చు, అలాగే బహిరంగ ప్రదేశాలలో కూడా ముచ్చట్లు పెట్టుకోవచ్చు. అయితే బయట మాత్రం భౌతిక దూరం పాటించాలి. ఇళ్ళలో పరిమిత ప్రదేశాలలో  మాత్రం హగ్గులు హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. మొత్తానికి చూస్తే  అక్కడ మంచి రోజులు వచ్చేశాయి అన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: