ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరూ కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. దేశంలో పరిస్థితులు ఆర్థికంగా కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ప్రజలకు ఉపాధి కూడా దొరికే అవకాశాలు ఎక్కువగా కనబడటం లేదు అని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి లోనే ఉన్నాయి అనే మాట కూడా వాస్తవం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎంతో కొంత సహాయం చేసి వారికి ఆహారానికి మాత్రం ఇచ్చే అవకాశం ఉంటుంది.

కానీ ఇప్పుడు కొంతమంది ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఎక్కువగానే వినబడుతున్నాయి. రాజకీయంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కూడా ఇప్పుడు రాష్ట్రంలో కాస్త ఆర్థికంగా ఇబ్బందులు సృష్టిస్తోంది. ఈ తరుణంలో ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో లాక్ డౌన్ ను ప్రకటించిన తర్వాత ప్రజలు అనుసరించిన వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దారితీస్తోంది. యాభై లక్షల నుంచి మూడు కోట్ల వరకు కొన్ని వైన్ షాపులలో అమ్మకాలు జరిగాయి అంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రజలు ఆర్థికంగా కష్టాలు ఉన్నా సరే ఈ విధంగా డబ్బులు ఖర్చు చేయడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తినడానికి తిండి లేకపోయినా సరే ప్రజలు ఈ విధంగా వ్యవహరించడం ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల వద్ద నుంచి భారీగా వసూలు చేయడానికి సంక్షేమ కార్యక్రమాల పేరుతో డబ్బులు ఇచ్చి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదే వైఖరి భవిష్యత్తులో కూడా కొనసాగితే ప్రజలు రోడ్డున పడే అవకాశాలు ఉంటాయని ఇంట్లో వాళ్ళు తినడానికి డబ్బులు లేకపోయినా మందు కొనుక్కోవడానికి ఏ విధంగా డబ్బులు వస్తున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: