భారత్ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో చేరింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మేకిన్ ఇండియా కాన్సెప్ట్ తో ఇతర దేశాలపై ఆధార పడకుండా స్వయంగా వస్తువులు తయారు చేసుకోవడం, అవి కూడా పూర్తి స్థాయిలో ఫలితాలు సాధిస్తుండడంతో భారత్ అగ్రదేశాల సరసన చేరింది. సాంకేతిక పరంగా, వైజ్ఞానిక పరంగా సొంతంగా ఉపగ్రహాలను తక్కువ పెట్టుబడితో తయారు చెయ్యడమే కాకుండా వాటిని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశ పెడుతుండడం భారత్ సాంకేతికంగా ఎంత అభివృద్ది చెందిందో చెప్పకనే చెప్తున్నాయి.  . 

ఇక ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ కు భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఏకంగా రెండు టీకా లను రూపొందించి అగ్రదేశాలకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందనే చెప్పాలి. రష్యా వంటి అగ్రదేశం అభివృద్ది చేసిన " స్పుత్నిక్ -వీ " టీకా, కంటే భారత్ అభివృద్ది చేసిన కోవాషీల్డ్, కోవాక్సిన్ టీకా లపై చాలా దేశాలు ఆధారపడ్డాయి. భారత్ నుండి భారీ మొత్తంలో వ్యాక్సిన్లను పలు దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా భారత్ గతంలో ఆయుధ సంపత్తి కోసం అమెరికా, జర్మనీ, రష్యా, వంటి దేశాలపై ఆధారపడే పరిస్థితుల నుండి ఇప్పుడు అగ్రదేశాలకే ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయిలో భారత్ చేరుకోవడం నిజంగా హర్షనీయాంశం.  .

 తాజాగా భారత్, అమెరికాకు పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చెయ్యడం భారత్ అభివృద్ది కి అద్దం పడుతుంది. దాదాపు పదిలక్షల ఎమ్1 93 బుల్లెట్లను  భారత్ , అమెరికాకు ఎగుమతి చేసింది. అంతే కాకుండా స్వతహాగా అధునాతన ఏకే 203 ఆయుధాలు తయారు చేస్తూ ప్రపంచంలో పెద్దన్న పాత్ర వహిస్తున్న దేశాలకు గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. భారత్ అభివృద్ది ఇలాగే కొనసాగితే పెద్దన్నపాత్ర వహించే అమెరికా, రష్యా వంటి దేశాలకు చెక్ పెట్టె అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది.  .

మరింత సమాచారం తెలుసుకోండి: