ఏపీలో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గా ఉన్న విషయం తెలిసిందే. జగన్ ఇమేజ్ కావొచ్చు, ప్రభుత్వం అందించే పథకాలు కావొచ్చు ఇలా ప్రతి అంశం ఎమ్మెల్యేలకు బాగా ప్లస్ అవుతుంది. కొంతమందికి సొంతంగా పెద్దగా బలం లేకపోయిన సరే వారికి జగన్ ఇమేజ్ బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఇటీవల పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ దాదాపు క్లీన్‌స్వీప్ చేసినంత పని చేసింది.


ఇలా వైసీపీ గెలవడానికి ఎమ్మెల్యేలు కంటే జగన్ ఇమేజ్ ప్రధాన కారణమని చెప్పొచ్చు. అయితే ఇదే ఇమేజ్ నెక్స్ట్ ఎన్నికల్లో కూడా కొందరు ఎమ్మెల్యేలకు ప్లస్ అవుతుందని తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యేలకు తిరుగుండదని అర్ధమవుతుంది. కడప, కర్నూలు, నెల్లూరు ఎమ్మెల్యేలకు జగన్ బొమ్మ శ్రీరామరక్షలాగా ఉందని తెలుస్తోంది. ఈ మూడు జిల్లాలు జగన్‌ని ఎక్కువగా అభిమానించడం వల్లే వైసీపీకి ప్లస్ అవుతుంది.


2014 ఎన్నికల్లో సైతం రాష్ట్రంలో టీడీపీ గాలి ఉంటే, ఈ మూడు జిల్లాల్లో జగన్ వేవ్ నడిచింది. నెల్లూరులో 10 సీట్లలో 7, కర్నూలులో 14 సీట్లలో 11, కడపలో 10 సీట్లలో 9 స్థానాలు వైసీపీనే గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. పైగా వైసీపీ అధికారంలో ఉంది. దీంతో ఎమ్మెల్యేలకు మరింత బలం పెరిగింది. పైగా ఈ మూడు జిల్లాల్లో టీడీపీ వీక్‌గా కనిపిస్తోంది.


కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ ఈ మూడు జిల్లాల ఎమ్మెల్యేలకు గెలుపు విషయంలో ఎలాంటి ఢోకా ఉండదని తెలుస్తోంది. ఒకవేళ రాష్ట్రంలో పోటాపోటి ఉన్న సరే, కడప, కర్నూలు, నెల్లూరుల్లో వైసీపీకి అనుకూలంగా వాతావరణం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ మూడు జిల్లాల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు జగన్ ఇమేజ్ మీద ఆధారపడి ఉన్నారు. అలా కాకుండా వారు రానున్న మూడేళ్లలో సొంతంగా కాస్త బలపడితే పార్టీకి ప్లస్ అవుతుంది. ఒకవేళ అనూహ్యంగా టీడీపీ పుంజుకుంటే, సొంత బలం లేని ఎమ్మెల్యేలని జగన్ ఇమేజ్ కూడా కాపాడలేదని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: