ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతో వేగంగా కొనసాగుతుంది. గత ఏడాది వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రస్తుతం దేశంలో రూపాంతరం చెందుతూ వివిధ దశలలో విజృంభిస్తోంది. ఇక మొదటి దశ తో పోల్చి చూస్తే రెండవ దశ ప్రమాదకర రీతిలో ప్రభావం చూపింది.  ఈ క్రమంలోనే ఇక మరికొన్ని రోజుల్లో మూడవ దశ వైరస్ కూడా రాబోతుంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తూన్న నేపథ్యంలో వైరస్ పై సమర్థవంతంగా పోరాటం చేయడానికి ప్రస్తుతం వ్యాక్సిన్ కీలకంగా మారింది. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ విషయంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాయి.



 ముఖ్యంగా తమ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ అందించే దిశగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. అందరికీ వ్యాక్సిన్ అందించి అందరిలో యాంటీబాడీలను ఉత్పత్తి అయ్యేలా చేస్తే ఇక ఎలాంటి పరిస్థితులు ఎదురైనా  ఎదుర్కోవచ్చు అని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.  ఇటీవలె కేంద్ర ప్రభుత్వం కూడా 18 సంవత్సరాలు నిండిన వారు అందరికీ ఉచితంగా టీకా అందిస్తాము అంటూ ఇటీవల ప్రకటించడం తో అటు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నాయి.



 ఇక రేపటి నుంచి రాజస్థాన్ లో ఇంటింటికి వ్యాక్సిన్ అనే కార్యక్రమం మొదలు కాబోతుంది.  రాజస్థాన్లోని బికనీర్ నగరం వ్యాక్సినేషన్ విషయంలో ప్రస్తుతం దేశానికి ఆదర్శంగా మారిపోతుంది. 45 ఏళ్లు లేదా అంతకు మించి వయస్సు ఉన్నవారికి ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని రేపటి నుంచి ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇక ఇంటింటికీ వ్యాక్సిన్ ప్రక్రియను వేగంగా కొనసాగించేందుకు ప్రజలందరికి సహాయం కోసం ఒక వాట్సాప్ నెంబర్ ఇవ్వగా.. ఇందుకోసం రెండు అంబులెన్స్ లు, 3 మొబైల్ బృందాలు కూడా పని చేస్తున్నాయి.  ఇలా ఇంటింటికీ వ్యాక్సిన్ అనే ప్రక్రియ ద్వారా వేగంగా వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు అని అక్కడి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: