బ్రహ్మంగారి మఠానికి సంబంధించి జరుగుతున్న వివాదం మీద దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. ప్రస్తుత పీఠాధిపతి గా ఉన్న వీర భోగ వసంత వెంకటేశ్వరస్వామి కరోనా కారణంగా మరణించారని అయితే ఆయనకి ఇద్దరు భార్యలు ఉండగా వారి సంతానం ఇప్పుడు  ఆధిపత్యం కోసం పోరాడుతున్నారని అన్నారు. అయితే పీఠానికి సంబంధించిన వీలునామాలు ఏవి దేవాదాయ శాఖకు అందలేదని ఆయన పేర్కొన్నారు. సెక్షన్ 54 ప్రకారం వీలునామా రాసిన 90 రోజుల్లో ధార్మిక పరిషత్ కు దానిని పంపాలని కానీ సెక్షన్ 54 ప్రకారం అది అందకపోవడం వల్ల ఆ సెక్షన్ లో ఉన్న రెండో క్లాజ్ ప్రకారం ధార్మిక పరిషత్ తదుపరి నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. 


ముందుగా 30 రోజులు ముందు నోటీసు ఇచ్చి అందరితో చర్చిస్తామని ఆ తర్వాత కడప అసిస్టెంట్ కమిషనర్ ను మఠం పర్యవేక్షణ కోసం క్విక్ పర్సన్ గా నియమించామని అన్నారు. అలానే పరిస్థితి తెలుసుకునేందుకు సీనియర్ అధికారి నియమిస్తున్నామని పేర్కొన్న ఆయన ఈ రిపోర్టు అలాగే మఠాధిపతులు అందరూ కలిసి ఇచ్చే నివేదికను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ వివాదం గురించి అనేక మంది తనను కలిసి వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేశారని ఆయన అన్నారు. 


దేశంలో ఏం జరగబోతుందో కాలజ్ఞానం ద్వారా బ్రహ్మంగారు ముందే వివరించారని అలాంటి గొప్ప వ్యక్తి ఏర్పరచిన పీఠం గురించి ఇప్పుడు అనవసరంగా రాద్ధాంతం వివాదాలు చేయవద్దని ఆయన కోరారు. ఆయన కుటుంబం లో వచ్చిన వివాదాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని ఈ సమయంలో విద్వేషాలు రెచ్చగొట్టకుండా అందరూ సమన్వయంతో ఉండాలని ఆయన కోరారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన అన్ని విషయాల్లో మంచి జరిగేలాగానే మా నిర్ణయం ఉంటుందని మంత్రి కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: