2014కు ముందు ప్రపంచ దేశాలు మొత్తం పూర్తిగా అరబ్ కంట్రీస్ పైనే ఎక్కువగా ఆధార పడుతూ ఉండేవి .  ఇలాంటి నేపథ్యంలోనే ఆయిల్ దేశాలైన అరబ్ దేశాలు ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేసేది. ఇక అరబ్ దేశాల  ఆధిపత్య ప్రయత్నం రోజురోజుకు పెరుగుతూ  వచ్చింది.  ఇలాంటి తరుణంలో భారత్ ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేసింది. ప్రపంచానికి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల గురించి చైతన్య  పరిచింది . అరబ్ కంట్రీస్ ఆధిపత్యాన్ని తగ్గించాలని చర్చించింది. ఈక్రమంలోనే సోలార్ విండ్ అనే సరికొత్త కాన్సెప్ట్ ని తెర మీదికి తెచ్చింది.



 ఇక భారత ఐడియాలజీ కి ఐక్యరాజ్యసమితి అంగీకరించింది.  ప్రపంచ లోని అగ్ర  దేశాలు సైతం భారత్ వెంట నడిచాయి  .  అప్పటి నుంచి ప్రపంచ దేశాలు సోలార్ విండ్ పై ప్రత్యేక దృష్టి సారించాయ్.  ఆయిల్ దేశాల అవసరం తగ్గుతూ.. సోలార్ విండ్ ఉపయోగం పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం సోలార్ పవర్ అతి తక్కువ ధరకు దొరికే పరిస్థితి ఏర్పడింది. విండ్ ఎనర్జీ,సోలార్ ఎనర్జీ, అను ఆధారిత విద్యుత్ కేంద్రం లాంటివి ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికే సోలార్ పవర్ లో భారత్ ఎంతో అభివృద్ధి సాధించింది. ఇప్పుడు విండ్ పవర్ లో కూడా ప్రపంచ దేశాలకు పోటీ ఇస్తుంది భారత్.



 తాజా లెక్కల ప్రకారం... విండ్ పవర్ లో ఏకంగా నాల్గవ స్థానానికి చేరింది.  ప్రపంచంలోనే చైనా విండ్ పవర్ లో మొదటి స్థానంలో ఉండగా ఇక రెండవ స్థానంలో అమెరికా... మూడో స్థానంలో  జర్మనీ కొనసాగుతున్నాయి.  ఇక భారత్ తక్కువ సమయంలోనే ఎక్కువ అభివృద్ధి సాధించి నాల్గవ స్థానానికి చేరుకుంది. 2014 నుంచి విండ్ ఎనర్జీ పై భారత్ ఎక్కువగా దృష్టి సారించింది. నాటినుంచి నేటివరకు విండ్ పవర్ అభివృద్ధిలో  దూసుకుపోయిన భారత్ ఇప్పుడు ప్రపంచ అగ్ర దేశాలతో పోటీ పడుతూ  నాలుగవ స్థానంలో నిలవడం గొప్ప విషయం అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: