సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ పివి సునీల్ కుమార్ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. రఘురామకృష్ణంరాజు అరెస్టు తర్వాత ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తాజాగా సునీల్ కుమార్ మీద అలాగే కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డిజిపికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య లేఖ రాశారు. భారతీయ సంప్రదాయాన్ని కించపరుస్తూ బ్రిటిష్ వారి సంప్రదాయాలను పొగుడుతూ సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యల మీద చర్యలు తీసుకోవాలని కోరారు. 


ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉగ్రవాదం రీతిలో ఆత్మార్పణ చేయడానికి సిద్ధపడాలని దళిత యువతను సునీల్ కుమార్ ఉద్రేకపరుస్తుంది అని ఆయన ఆరోపించారు. సమాజంలో ఉన్న రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రేకెత్తించే రీతిలో సునీల్ కుమార్ ఉపన్యాసాలిస్తున్నారని లేఖలో వార్ల రామయ్య ఆరోపించారు. అమెరికాలో వరల్డ్  ట్రేడ్ సెంటర్ ను కూల్చిన ఉగ్రవాదులను ఆదర్శంగా తీసుకోవాలని దళిత యువతను అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు ఉద్రేకపరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 


ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ, సర్వీస్ కాండక్ట్ రూల్స్ ను  ఉల్లంఘించిన ఈ ఇద్దరు పోలీస్ అధికారులపై చర్య తీసుకోవాలని వర్ల రామయ్య లేఖలో కోరారు. ఇండియన్ పీనల్ కోడ్ 124 (A) సెక్షన్ ప్రకారం వీరిపై రాజద్రోహ నేరం కేసు రిజిస్టర్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వర్ల లేఖలో డీజీపీని కోరారు. అంతే కాక ఇండియన్ పీనల్ కోడ్ 153 (A)  మరియు 295 (A) సెక్షన్స్  ప్రకారం కూడా ఈ ఇద్దరు పోలీసు అధికారుల మీద క్రిమినల్  చర్యలు తీసుకోవాలని లేఖలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ను వర్ల రామయ్య కోరారు. మరి దీనికి ఆయన నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో వేచి చూడాల్సి ఉంది. 

   

మరింత సమాచారం తెలుసుకోండి: