రాహుల్ గాంధీ యాభై ఏళ్ళు దాటేశారు. మామూలుగా అయితే ఏమో కానీ రాజకీయాల‌లో ఆయన యువ నాయకుడి కిందనే లెక్క. ఎందుకంటే అక్కడ ఎనభైలు, తొంబైలు చూస్తున్న నాయకులు ఉంటారు కాబట్టి. డెబ్బయ్యేళ్ళు పై దాటిన మోడీ దేశానికి ప్రధానిగా ఉంటే రాహుల్ యూత్ కిందనే లెక్క అని చెప్పాలి కూడా.

రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి థర్టీ ప్లస్ లోనే వచ్చారు. ఆయన ఇప్పటికి నాలుగు సార్లు లోక్ సభకు ఎన్నిక అయ్యారు. యూపీయే వన్, టూ ప్రభుత్వాలలో  ఏ పదవీ చేపట్టలేదు. నిజానికి 2009 ఎన్నికల వేళ మరోసారి యూపీయే పవర్ లోకి వచ్చింది. అపుడు మన్మోహన్ బదులు రాహుల్ ప్రధాని అవుతారు అని అంతా భావించారు. కానీ ఆయన కాదన్నారు.
పోనీ మన్మోహన్ ప్రభుత్వంలో మంత్రిగా చేరి అయినా పాలనానుభవం సంపాదించలేదు అన్న మాటా ఉంది. 2014 నాటికి యాంటీ ఇంకెంబెన్సీ, మోడీ క్రేజ్, యూపీయే అవినీతి భాగోతాలు అన్నీ కలసి ప్రభుత్వాన్ని ఓడించాయి. దాంతో గత రెండు దఫాలుగా రాహుల్ విపక్ష పాత్రలోనే ఉన్నారు. మొదటి సారి కంటే రెండవమారు రాహుల్ రాటుదేలారు. ఆయన మోడీ మీద చేస్తున్న విమర్శలకు జనం నుంచి కూడా మంచి రియాక్షన్ వస్తోంది. మోడీ మాటల గారడీ ముందు ఇన్నాళ్ళూ వెలవెలబోయిన రాహుల్ కరోనా వేళ కేంద్రం పేలవమైన పనితీరుతో ఒక్కసారిగా ముందుకు దూసుకువస్తున్నారు.

ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదులుకోకుండా కేంద్రాన్ని తూర్పారా పడుతున్నారు. జనం కూడా ఇపుడు రాహుల్ వైపు చూస్తున్నారు. వారు బాధితులు. తమ పక్షాల మాట్లాడే వారి వైపు వారు కళ్ళూ చెవులూ కచ్చితంగా ఉంటాయి. మరో మూడేళ్ళలో ఎన్నికలు ఉన్నాయి. రాహుల్ మాటల జోరు పెరిగింది. అదే సమయంలో ఆయన చేతలు కూడా ఇంకా స్పీడ్ అందుకోవాలి. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. అందులో ఒక్క యూపీ తప్ప మిగిలిన అన్ని చోట్లా కాంగ్రెస్ బీజేపీని డైరెక్ట్ గా  ఢీ కొట్టనుంది. ఇందులో కనీసం నాలుగు రాష్ట్రాలు గెలుచుకున్నా కాబోయే ప్రధాని రాహుల్ అని అంతా డిసైడ్ అయిపోవచ్చు అంటున్నారు.

తండ్రి రాజీవ్ గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీ ఫార్టీ ప్లస్ లో దేశానికి ప్రధానులు అయి రికార్డ్ క్రియేట్ చేశారు. రాహుల్ ఫిఫ్టీ ప్లస్ లో ఆ రేర్ ఫీట్ ని సాధిస్తారు అంటున్నారు కాంగ్రెస్ వాదులు. ఇపుడున్న పరిస్థితులు చూస్తూంటే దేశంలోని నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ముఖ్యమంత్రులు, పార్టీల నేతలు రాహుల్ లో భావి ప్రధానినే చూస్తున్నారు. జనంలో ఒక్కసారి మార్పు మొదలైతే రాహుల్ ప్రధాని కాకుండా ఆపడం ఎవరి తరమూ కాదేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: