ట్విట్టర్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అందరినీ ఒకచోట చేర్చిందని చెప్పచ్చు. ఇది ఆలోచనలను షేర్ చేసుకోవడానికి ఉన్న ఒక మాధ్యమంగా మొదలయినా రియల్ టైంలో సమాచారాన్ని చేరవేయడానికి ఇది అత్యంత శక్తివంతమైన మాధ్యమంగా మారింది. పెద్ద పొజిషన్ లో ఉన్న వ్యక్తులు ఏదైనా చెప్పవలసి వచ్చినప్పుడు, వారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కంటే తమ మొదటి సందేశాన్ని ట్విట్టర్‌లోనే ఇవ్వడం పరిపాటిగా మారింది. అందుకే మన దేశంలో అధికారిక సమాచారం కోసం ప్రజలు ట్విట్టర్‌లో సెలబ్రిటీలను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఇక ట్విట్టర్‌లో ఫాలో అయ్యే వారిలో ప్రధాని నరేంద్ర మోడీ పేరు మొదటి స్థానంలో ఉంది. దేశ, విదేశాలలో 7 కోట్ల మంది ప్రజలు ట్విట్టర్‌లో ప్రధాని మోదీని అనుసరిస్తున్నారు. ట్విట్టర్‌లో ఫాలో అయ్యే వ్యక్తులలో ప్రధాని నరేంద్ర మోడీకి దగ్గరలో కూడా మరే భారతీయుడు లేడు. రెండవ నంబర్ లో అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఆయనకు 4.58 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు, అంటే ప్రధాని కంటే 2.5 కోట్లు తక్కువ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తర్వాత, దేశంలో చాలా మంది హీరోలను అనుసరిస్తున్నారు. ఇక ట్విట్టర్‌లో ఎక్కువగా అనుసరించే వారిలో మూడవ పేరు ఏ వ్యక్తికి చెందినది కాదు. అది పిఎంఓ ఇండియా ఖాతా. అంటే దేశ ప్రధాని కార్యాలయం. 4.32 కోట్ల మంది ట్విట్టర్‌లో పిఎంఓ ని అనుసరిస్తున్నారు. దీని తరువాత టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నారు.

 

 

నరేంద్ర మోడీ             7 కోట్లు 

అమితాబ్ బచ్చన్          4.58 కోట్లు

పిఎంఓ                   4.32 కోట్లు 

విరాట్ కోహ్లీ               4.30 కోట్లు 

సల్మాన్ ఖాన్              4.26 కోట్లు 

షారుఖ్ ఖాన్              4.18 కోట్లు 

అక్షయ్ కుమార్            4.17 కోట్లు 

సచిన్ టెండూల్కర్         3.57 కోట్లు 

హృతిక్ రోషన్             3.50 కోట్లు 

దీపికా పదుకొనే            2.76 కోట్లు

ప్రియాంక చోప్రా           2.72 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి: