గ‌తంలో న‌మోద‌యిన కేసుల‌పై, లేదా దాఖ‌ల‌యిన పిటీష‌న్ల‌పై కోర్టు నుంచి ఊర‌ట పొందుతున్నారు జ‌గ‌న్. అనుకూల తీర్పుల‌తో జ‌గ‌న్ ఆనందంగా ఉన్నారు. సుప్రీం కోర్టు నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల‌కు సంబంధించి అవి చెల్ల‌వ‌ని చెప్పిన కోర్టు, త‌రువాత సంబంధిత తీర్పును పెండింగ్ లో ఉంచింది. త‌రువాత కాలంలో జ‌రిగిన ప‌రిణామాల ఆధారంగా సింగిల్ జ‌డ్జి ఇచ్చిన తీర్పును స‌వాలు చేస్తూ ఎస్ ఈ సీ హైకోర్టును ఆశ్ర‌యించింది. దీంతో జ‌గన్ ప్ర‌భుత్వంకు రిలీఫ్ దొరికింది. ఇవాళ ఇచ్చిన తీర్పు కార‌ణంగా జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నుంది.


పాలన ఎలా ఉన్నా స‌రే జ‌గ‌న్ అనుకున్న‌వి అన్నీ కాక‌పోయినా కొన్నే అయినా సాధించ‌గ‌లుగుతున్నారు. తీవ్ర ఒత్తిడిలో కూడా జ‌యించ‌గ‌లుగుతున్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూనే విజ‌యాలు న‌మోదు చేస్తున్నారు. త‌న‌పై నిందలు వేసే వారికి సైతం  ని జాలేంటో చెప్ప‌క‌నే చెబుతున్నారు. దీంతో టీడీపీ, బీజేపీ ఏం చేయాలో పాలుపోక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి. ముఖ్యంగా గ‌త కొద్ది కాలంగా నిర‌స‌న‌లు వినిపిస్తున్న  ర‌ఘురామ కృష్ణం రాజు నిన్న‌టి వేళ సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో ఓడిపోయారు. ఆయ‌న దాఖ‌లు చే సిన బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ ను కోర్టు కొట్టివేయ‌డ‌మే కాకుండా ఉద్దేశ పూర్వ‌క పిటిష‌న్ల‌కు, ఊహా సంబంధిత ప్ర‌తిపాద‌న‌ల‌కు కోర్టులు ప్రాధాన్యం ఇవ్వ‌వు అని తేల్చేసింది.




దీంతో జ‌గ‌న్ మ‌రో మారు ఆర్ ఆర్ ఆర్ పై గెలిచారు. గెలిచినా కూడా ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఎక్క‌డా అతిగా స్పందించ‌లేదు. న్యాయ‌మే గెలిచింది అని రామ‌కృష్ణా రెడ్డి చెప్పి, విమ‌ర్శ‌కుల నోళ్లు మూయించారు. కేసులు దాఖ‌లు చేసే వారు కోర్టుల‌పై కూడా అనుమానాలు వ్య‌క్తం చేయ‌డాన్ని సైతం కోర్టులు త‌ప్పు ప‌ట్టాయ‌ని గుర్తు చేశారు. మ‌రోవైపు జగ‌న్ మ‌రో విజ‌యం కూడా ఇవాళ సాధించారు. ఎప్ప‌టి నుంచో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఓట్ల లెక్కింపుపై పెండింగ్ లో ఉంచిన కోర్టు స్ప‌ష్ట‌మ‌యిన తీర్పు ఒక‌టి ఇచ్చింది. ఓట్లు లెక్కించి ఫ‌లితాలు వెల్ల‌డించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap