తాలిబన్ లు పాక్ చైనా మరియు రష్యా సహకారంతో ఆఫ్ఘన్ ను ఆక్రమించారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసి ఐక్యరాజ్య సమితి సహా పలు దేశాల మరియు సంస్థలు తమను గుర్తించాలని ఆరాట పడుతున్నారు. వారి ఆరాటం ఎలా ఉన్నా పక్కనే ఉన్న చైనా, పాక్ మాత్రం వారిని గుర్తించాలని లేదంటే పరిస్థితులు వేరేలా మారిపోయే అవకాశాలు ఉన్నాయని బెదిరిస్తుండటం చేస్తున్నాయి. తాజాగా తాలిబన్ ఆఫ్ఘన్ ను గుర్తించాలని తాత్కాలిక ప్రభుత్వం తగిన ప్రతినిధిని నియమించి మరీ ఐక్యరాజ్య సమితికి లేఖ రాయడం జరిగింది. ఇప్పటికే శాశ్వత సభ్యత్వం లో ఉన్న చైనా తాలిబన్ ల గుర్తింపునకు విశేష కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఒక్కసారి తాలిబన్ లు గుర్తించబడితే ఇక ప్రపంచానికి చుక్కలు చూపించ వచ్చు అనేది వారి ఆలోచన. ఇష్టారాజ్యంగా ముష్కరులను లేదా ఆయా సంస్థలను ఇతర దేశాలలో బ్రాంచీలు మాదిరి అధికారికంగా ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే దొంగ చేతికి తలలు ఇచ్చినట్టే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు ముష్కరులకు ఒక దేశం ఉండటమే ప్రపంచానికి ముప్పు తెచ్చిపెట్టే సందర్భం అని దానికోసమే వారిని గుర్తించడం అనే అంశంపై ఆయా దేశాలు చాలా జాగర్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఒక సాధారణ దేశాన్ని గుర్తించడం పెద్ద విషయం ఏమి కాకపోయినా ఇక్కడ ఆ దేశం రాక్షసుల హస్తగతం అవడం తో ఆలోచించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని వారు చెపుతున్నారు.  

తాలిబన్ లు కూడా అందుకే ప్రపంచం తమని గుర్తించాలని ఆరాటపడుతున్నాయి. అందుకే కాస్త చడీచప్పుడు లేకుండా ఉన్నాయి. లేదంటే ఇప్పటికే భారీగా రక్తపాతాలకు రచనలు జరుగుతుండేవని నిపుణులు అంటున్నారు. ఇక ఆఫ్ఘన్ పై పాక్ ఆధిపత్యం ఒప్పుకోలేక తాలిబన్ లు; అదే ఆఫ్ఘన్ పై తాలిబన్ ల ఆధిపత్యం సహించలేని స్థితిలో ఐసిస్; అలాగే ప్రపంచం ముందు ఆఫ్ఘన్ ఆక్రమణ చేసిన పేరు తాలిబన్ లది మరి ఆధిపత్యం మాత్రం ఇంకొకరికి ఎలా ఇస్తాం అనేది తాలిబన్ ల పట్టుదల..ఇలా ఆఫ్ఘన్ కోసం వీరందరూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎవరికి పెత్తనం దొరికినా మిగిలిన వారు సహించబోరు, దానితో ఆ ప్రాంతం వారి కుమ్ములాటలతో రణరంగాన్ని తలపించక మానదు. అది ప్రపంచానికి మేలు చేయొచ్చు, ఆఫ్ఘన్ ప్రజలు మాత్రం అల్లాడిపోయే సందర్భం. ఈ కుమ్ములాటకు ముందు జరగాల్సిన పని ప్రపంచం తాలిబన్ ఆఫ్ఘన్ ను గుర్తించడం.. ఆ కాస్తా అయితే కుమ్ములాట మొదలైనట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: