తాలిబన్ లు ఆఫ్ఘన్ ఆక్రమణ చేయగానే అక్కడ ఐఎస్ దాడులు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అప్పటి దాడిలో అమెరికా సైన్యం కూడా మృతి చెందటంతో అమెరికా ప్రతీకార దాడులు చేసింది. ఈ దాడులలో కాబుల్ విమానాశ్రయం దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీనితో అప్పటి నుండి అక్కడ రవాణా ఆగిపోయింది. అలాగే తాలిబన్ లు ఇచ్చిన డెడ్ లైన్ కూడా ఆగష్టు 31తో ముగియడంతో అక్కడ ప్రాంతీయ విమానాలు తప్ప మిగిలినవి దాదాపు ఆగిపోయాయి. అయితే అమెరికాలో దెబ్బతిన్న విమానాశ్రయాన్ని ఖతార్, పాకిస్తాన్ సాయంతో బాగుచేశారు.

దీనితో కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణాలకు సిద్ధం అయిందని విదేశాలు తమ రవాణాను ప్రారంభించవచ్చని తాలిబన్ లు తెలిపారు. ఇప్పటికి కూడా ఆఫ్ఘన్ నుండి ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అని అక్కడ ప్రజలు అత్యుత్సాహంగా ఉన్నారు. అంటే మళ్ళీ అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ప్రారంభం అయితే రెక్కల మీద కూర్చోనైనా దేశం విడిచేందుకు అక్కడి పౌరులు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ విమానాయనాలు ప్రారంభం అయితే పరిస్థితి ఇలానే ఉండబోతుందని ఆయా దేశాలకు కూడా తెలుసు. అందుకే ఇప్పుడప్పుడే ఈ ప్రయాణాలు ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించటం లేదు.

తాలిబన్ లు మాత్రం ఆఫ్ఘన్ విద్యార్థులు, ఉద్యోగస్తులు విదేశాలలో తమ చదువులు కొనసాగించాలని చూస్తున్నారు, వారికోసం అంతర్జాతీయ ప్రయాణాలు ప్రారంభించాలని కోరుతున్నారు. అలాగే వివిధ కారణాలతో ఆయా దేశాలలో ఆగిపోయిన ఆఫ్ఘన్ యువతను స్వదేశానికి రావడానికి ఈ ప్రయాణాలు ప్రారంభం కావడం అవసరం అని వాళ్ళు అంటున్నారు. అయితే ఈ ప్రయాణాలు కొనసాగితే స్లీపర్ సెల్స్ ప్రపంచం మీదికి స్వేచ్ఛగా వదలడానికి  తాలిబన్ లు కాబుల్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించారని  నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై ఆయా దేశాలు ఇంకా స్పందించాల్సి ఉంది. ఒక్కసారి ఈ ప్రయాణాలు ప్రారంభం అయితే ఎలాగోలా తాలిబన్ ల నుండి తప్పించుకోవచ్చు అని ఆఫ్ఘన్ లు ఆశపడుతున్నారు. ఇప్పటికే పలువురు పాక్ సహా పలు ఆఫ్ఘన్ సరిహద్దు దేశాల బోర్డుర్ ల వద్ద ఆఫ్ఘన్ లు పడిగాపులు పడుతున్నారు. కాస్త వెసులుబాటు ఇస్తే ఆయా దేశాలకు వెళ్ళడానికి వాళ్లంతా సిద్ధంగా ఉన్నారు. తాజాగా తాలిబన్ లు ఆఫ్ఘన్ పౌరులకు తమ మార్క్ తో కొత్త ఐడీలు, పాస్ పోర్టులు ఇస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: