ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  బద్వేల్ ప్రజలకు లేఖ రాశారు. బద్వేల్ ఉపఎన్నిక తరుముకొస్తున్న తరుణంలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. బద్వేల్ నియోజకవర్గం లోని  అక్కా చెల్లెమ్మలకు మరియు అన్నదమ్ముల అందరికీ నమస్కారాలు చెప్పిన జగన్ మోహన్ రెడ్డి.. కరోనా నేపథ్యంలో ప్రచారానికి రాలేకపోతున్నానని పేర్కొన్నారు. బద్వేలు నియోజకవర్గంలో పర్యటించి... ప్రత్యక్షంగా ఓటర్లను ఓట్లను అడగాలని ముందు భావించానని కానీ కరోనా మహమ్మారి మరియు ఎన్నికల కమిషన్ నిర్ణయాల మేరకు రాలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

తాను బద్వేల్ నియోజకవర్గానికి వచ్చి ప్రత్యక్షంగా ఓట్లు అడిగితే.. అక్కడి అక్కాచెల్లెమ్మలను అందరూ గుమిగూడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలా జరిగితే కరోనా మహమ్మారి విజృంభించే ప్రమాదం పొంచి ఉందని స్పష్టం చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. తాను బద్వేల్ నియోజకవర్గానికి రాలేకపోయినప్పటికీ... వైసీపీ అభ్యర్థి నీ... భారీ మెజార్టీ తో గెలిపిం చాలని కోరారు సీఎం జగన్ మోహ న్ రెడ్డి.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరియు ఇవ్వని హామీలను కూడా కామన్ అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని... సంక్షేమ పథకాలను తాము అమలు చేస్తున్నామని... ఇకముందు కూడా అదే దారిలో వెళతామని స్పష్టం చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. బద్వేలు శాసనసభ ఉప ఎన్నికలలో తమ అభ్యర్థి అయిన దాస రి సుధా భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వెంకట సుబ్బయ్య గారి కంటే ఎక్కువ మెజారిటీ ఆయన సతీమణి దాసరి సుధా కు రావాలని కో రారు. కాగా.. బద్వేల్‌ బరిలో వైసీపీ మరియు భార తీయ జనా తా పా ర్టీ బరి లో ఉన్న సం గతి మనం దరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: