తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని కొన్ని విషయాల్లో రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో బలమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నా సరే కొంతమంది కీలక నాయకుల నుంచి ఆయనకు సహకారం లేకపోవడంతో కాస్త ఒత్తిడికి గురవుతున్నారు అనేది మీడియా వర్గాలు అంటున్నాయి. రాజకీయంగా పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తో కలిసి కొన్ని వ్యూహాలు సిద్ధం చేసుకుని వాటిని తెలంగాణలో అమలు చేసే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నా సరే అవి పెద్దగా ఫలించలేదు.

ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని నమ్మేవాడు లేరని అలాగే రేవంత్ రెడ్డి నమ్మేవాళ్ళు కూడా దాదాపుగా లేరనే ఒకరిద్దరు నాయకులు మాత్రమే రేవంత్ రెడ్డి మాట వింటున్నారని మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా రేవంత్ రెడ్డి ని ఫాలో అవ్వటం లేదు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ప్రస్తావిస్తే కచ్చితంగా అధికారపార్టీకి వెళ్ళిపోతుందని అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నాయకులందరూ కూడా టిఆర్ఎస్ పార్టీలో చర్చలు జరుపుతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

రాజకీయ పరంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశాలు ఉన్నా సరే కొన్ని కొన్ని విషయాల్లో ఆ పార్టీ వెనుకడుగు వేయడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డికి నమ్మకస్తుడు లేకపోవడమేనని గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎదుర్కొన్న పరిస్థితులు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారని భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే పరిస్థితి ఎదురుకావచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి భవిష్యత్తులో అయినా సరే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే దిశగా అడుగులు వేస్తున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించే లేక ఆయన పదవి నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: