ప్రధాని మోడీ ముందు ఇప్పుడు నిప్పులాంటి పరీక్ష ఎదురుచూస్తోంది. తెరవెనుక కథ నడిపిస్తున్న అసలు సిసలు శత్రువు ఎవరో ఆయనకు తెలియంది కాదు. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల వెనుక, ముఖ్యంగా పహల్గామ్‌లో జరిగిన నరమేధం వెనుక చైనా హస్తం ఉందన్నది బహిరంగ రహస్యం. అమాయక ప్రజలను మతం పేరుతో వేరు చేసి, హిందువులను టార్గెట్ చేస్తూ జరిగిన ఈ దాడి వెనుక ఉన్న అసలు లక్ష్యం వేరు. దేశంలో హిందూ-ముస్లింల మధ్య చిచ్చుపెట్టి, మత ఘర్షణలు సృష్టించి, దేశాన్ని అంతర్యుద్ధంలోకి నెట్టాలనేది పాక్ ఆశ.

కానీ ఈ ఆశకు ఆజ్యం పోస్తోంది, సాంకేతిక సాయం అందిస్తోంది చైనానే. ఆయుధాలు, ఉగ్రమూకలను పాక్ సరఫరా చేస్తుంటే, దానికి కావాల్సిన టెక్నాలజీ, వ్యూహాన్ని చైనా అందిస్తోంది. ఎందుకు..? భారత్ ఆర్థికంగా ఎదుగుతుండటం, ప్రపంచ వేదికపై, ముఖ్యంగా అమెరికాతో కలిసి బలపడటం డ్రాగన్‌కు కంటగింపుగా మారింది. తన వ్యాపార సామ్రాజ్యానికి పోటీ వస్తున్న భారత్‌ను దెబ్బతీయాలంటే, ఇలాంటి కుళ్లు రాజకీయాలు, ఉగ్రవాద దాడులతో దేశాన్ని కుంగదీయాలన్నది చైనా ప్లాన్.

భారత్‌ను యుద్ధ వాతావరణంలోకి లాగితే, అది ఆర్థిక పోటీ నుంచి పక్కకు తప్పుకుంటుంది. అదే సమయంలో అమెరికాకు దగ్గరవుతున్న ఇండియాను వివాదాల్లో ఇరికిస్తే, తన ఆధిపత్యానికి అడ్డు ఉండదనేది చైనా దురాలోచన. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ను పావుగా వాడుకుంటూ, ఉగ్రవాదానికి ఊతమిస్తోంది. భారత్-పాక్ మధ్య నిరంతరం ఉద్రిక్తతలు కొనసాగితే, ఆసియాలో తనదే పెత్తనం అవుతుందని, ప్రపంచ దేశాలు తనపైనే ఆధారపడతాయని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది.

ఇది ప్రధాని మోడీకి కత్తి మీద సాము లాంటి పరిస్థితి. ఒకవైపు కవ్విస్తున్న పాకిస్తాన్‌కు దమ్ము చూపించి, గట్టిగా బుద్ధి చెప్పాలి. మరోవైపు, చాపకింద నీరులా విస్తరిస్తున్న చైనా ఉచ్చులో చిక్కుకోకుండా దేశాన్ని ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ముందుకు నడిపించాలి. ఈ రెండు సవాళ్లను మోడీ ఎలా ఎదుర్కొంటారో, పాకిస్తాన్ తోక జాడింపులకు ఎలా అడ్డుకట్ట వేస్తారో, అదే సమయంలో చైనా కుట్రలను ఎలా తిప్పికొడతారో యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దేశ భవిష్యత్తునే కాదు, ఈ ప్రాంత భౌగోళిక రాజకీయాలను కూడా ప్రభావితం చేయనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: