జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి  అన్ని పార్టీలు ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. వారి బలం ఏంటో  చూపించుకోవడానికి  జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఇదే తరుణంలో  కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి పార్టీలే  హైలెట్ గా నిలుస్తున్నాయని చెప్పవచ్చు. ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఎక్కువ పోటీ ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి  మాగంటి సునీత  హోరాహోరీగా పోటీ పడవచ్చు అని తెలుస్తోంది. ఇక ఈ పార్టీలకు సంబంధించి రాష్ట్ర స్థాయి నాయకులంతా జూబ్లీహిల్స్ లోనే తిష్ట వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేస్తూ మాకు ఓటేయాలంటే మాకు ఓటేయాలంటూ ప్రజలను వేడుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ ఏమీ చేయలేదని మేము వచ్చిన తర్వాత 150 కోట్లు ఖర్చుపెట్టి కొన్ని అభివృద్ధి పనులు చేశామని చెప్పుకుంటుంది. 

ఇక బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ మొత్తం ఫెయిల్ అయిందని గత పది సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి తప్ప వీళ్ళు రెండు సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదంటూ చెప్పుకొస్తోంది. ఈ విధంగా నాయకులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు గుప్పించుకుంటూ ఉంటే, మరోవైపు సర్వేలు కూడా పార్టీ నాయకులను గమ్మత్తు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇప్పటివరకు వచ్చిన సర్వేల్లో మూడు సర్వేలు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తూ వస్తే ఒక సర్వే కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తూ వచ్చింది. ముఖ్యంగా చాణక్య,  కేకే, ఎస్ఏఎస్ సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుందని తెలియజేశారు. ఇక సైదులు సర్వే కాంగ్రెస్ గెలుస్తుందని రాస్కొచ్చారు.

ఈ సర్వేల ప్రభావం కూడా తటస్థ ఓటర్లపై పడుతుందని కొంతమంది నాయకులు అంటున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో ఉండేటువంటి 10 శాతం మంది తటస్థ ఓటర్లు  సర్వేను బట్టే పార్టీలకు ఓటు వేసే అవకాశం ఉంది. ఈ సర్వేలు చెప్పింది కూడా ఒక్కొక్కసారి బోల్తా కొడుతూ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు కూడా ఏ పార్టీ ఎలాంటి పథకాన్ని తీసుకొస్తుంది, ఎలాంటి హామీ ఇస్తుందనే దానిపై కూడా ఓటర్లు అటు ఇటుగా ఓట్లు వేస్తూ ఉంటారు.మరి చూడాలి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఏమైనా గమ్మత్తు చేసి ఓటర్లను తన వైపు తిప్పుకుంటుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: