అమ్మాయి కోసం అబ్బాయిలు త్యాగాలు చేస్తుంటారు.  చేసిన త్యాగాల విషయం పక్కన పెడితే.. అబ్బాయి పక్కన సీటు దొరకలేదని ఓ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు.  షాక్ కావడమే కాదు.. బాప్ రే అని బెదిరిపోతారు కూడా.  అదెలాగో ఇప్పుడు చూద్దాం.  ఇద్దరు భారీగా ప్రేమించుకున్నారు.  భారీగా అంటే మరోలా అనుకోకండి.  భారీగా అంటే డీప్ గా అని అర్ధం.  అలా డీప్ గా ప్రేమించుకున్న ఆ జంట.. బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఔటింగ్ కు వెళ్లాలని అనుకుంది.  


అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంది.   ఫ్లైట్ బుక్ చేసుకున్నారు.  దురదృష్టం ఏమంటే.. ఇద్దరికి పక్కపక్కన సీట్లు దొరకలేదు. దీంతో ఆ అమ్మాయి ఎయిర్ హోస్ట్రెస్ ను సీట్ ఎడ్జెస్ట్ చేయమని అడిగింది.  కానీ, అప్పటికే ఫ్లైట్ ఫుల్ కావడంతో పక్కపక్కన సీట్స్ ఎడ్జెస్ట్ కాలేదు.  దీంతో ఆ అమ్మాయికి కోపం వచ్చేసింది.  నూడిల్స్ లో ఉన్న వేడి నీటిని ఆ ఫ్లైట్ అటెండెంట్ పై పోసింది.  అలా పోయడమే కాకుండా పెద్దపెద్దగా కేకలు వేస్తూ తిట్లపురాణం అందుకుంది.  


అయితే, ప్రయాణికులు ఏదోలా సర్దిచెప్పి కూర్చోపెట్టారు.  దిగవలసిన గమ్యస్థానం వచ్చింది.  అనంతరం ఎయిర్ హోస్ట్రెస్ ఇచ్చిన కంప్లైట్ తో ఆ ప్యాసింజర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అంతేకాదు, ఇకపై ఎయిర్ ఏషియాలో వారు ప్రయాణించకుండా వారిపై నిషేధాన్ని విధించింది ఎయిర్ ఏసియా.  ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ కావడం కోపంతో రెచ్చిపోవడం వంటివి చేస్తుంటే ఇలానే ఉంటుంది.  



ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉంటాయి.  ప్రయాణం చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  అప్రమత్తంగా ఉంటేనే... ఏదైనా చేయగలం.. పక్కన ఉన్న వ్యక్తులపై కోపంగా రుసరుసలాడుతూ చిందులు వేస్తుంటే మాత్రం ఇలాంటి గడవలు వస్తూనే ఉంటాయి.  ఇబ్బందులు పడాల్సి వస్తూనే ఉంటుంది.  కాబట్టి వీలైనంత జాగ్రత్తగా ఉంటే మంచిది. 


మరింత సమాచారం తెలుసుకోండి: