వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వరసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రతిపక్షాలకు షాక్ ఇస్తున్నాడు.  ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.  నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వాటిని అమలు చేస్తున్న తీరు కూడా అంతే దూకుడుగా ఉంటోంది.  మద్యపాన నిషేధం విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అదే విధంగా ఉంటున్నాయి.  అక్టోబర్ 1 వ తేదీ నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే సొంతంగా నిర్వహిస్తోంది.  ఈ విషయం అందరికి తెలిసిందే.  



మద్యం అమ్మకాలను ప్రభుత్వం స్వయంగా నిర్వహిస్తుండటంతో.. పాపం మందుబాబులు కొంత ఇబ్బందులు పడుతున్నారు.  మద్యం కోసం క్యూలైన్లో నిలబడుతున్నారు.  షాపుల సంఖ్య తక్కువ పైగా బెల్టు షాపులకు అనుమతులు లేవు.  తీసుకున్న మద్యాన్ని ఇంటికి వెళ్లి తాగాల్సిందే తప్పించి అక్కడ తాగేందుకు వీలులేదు.  అంతేకాదు, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అమ్మకాలు ఉంటాయి.  రాత్రి 8 దాటితే మందు బంద్.  ప్రైవేట్ షాపుల్లో దొరికినట్టుగా బ్లాక్ లో దొరకదు.  


ముందుకు పాపం ఏపీలో కిలోమీటర్ల లెక్కన క్యూలైన్లలో నిలబడుతున్నారట ప్రజలు.  ఎదో కొత్త సినిమా రిలీజ్ అయినపుడు ఎలాగైతే క్యూలో ఉంటారో అలా ఉంటున్నారు.  అయితే, తెలంగాణాలో పరిస్థితి వేరుగా ఉన్నది.  ఇక్కడ మద్యం వరదలై పారుతుంది.  మద్యాని ప్రజలు చాలా తీవ్రంగా బానిసలైపోతున్నారు.  గతంలో 10 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ అయ్యేవి.  ఇప్పుడు మరో గంట అదనంగా కేటాయించారు.  అన్ని దుకాణాలు 10 గంటల వరకు మూతబడితే.. మద్యం దుకాణాలు మాత్రం రాత్రి 11 గంటల వరకు తెరిచే ఉంటున్నాయి.  


అడుగడుక్కు హైదరాబాద్ లో మద్యం షాపులు ఉండటంతో మద్యం సేవించే వ్యక్తులు రోజురోజుకు పెరిగిపోతున్నారు.  యువత పెడదోవన పడుతున్నది.  యువత చెడు మార్గంలో పయనించడానికి కారణం ఒకరకంగా మందు అని చెప్పొచ్చు.  ఫ్యాషన్ కోసం మొదలుపెట్టనా తరువాత మందుకు బానిసైపోతున్నారు. జీవితాలు పాడుచేసుకుంటున్నారు.  ఇప్పుడు ఇక్కడ కూడా మద్యం పాలసీని తీసుకొస్తే బాగుంటుంది.  మద్యపాన నిషేధం విధిస్తే కొంతవరకు ప్రజలు బాగుపడతారు.  ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకోకుండా ఉంటారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: