అనగనగా ఒక అడవిలో ఒక జిత్తులమారి నక్క హాయిగా తిరుగుతూ ఉండేది. అయితే జిత్తులమారి నక్క కంటపడకుండా మిగిలిన జంతువులన్నీ తప్పించుకొని తిరుగుతూ ఉండేవి. ఇక దాంతో చేసేదేమీ లేక ఆ నక్క అడవిలో దొరికే ఆకులు, అలములు తింటూ జీవనం కొనసాగిస్తూ వస్తోంది. అయితే ఒక రోజు దానికి ఆహారం లేక బాగా నీరసించి పోయి ఆహారం కోసం వెతుకుతూ ఉండగా, దానికి ఒక పిల్లి ఎదురైతే ఎలా ఉన్నావ్ పెద్దమ్మ అని అడిగింది. నక్క పిల్లి ని చూసి ఆప్యాయంగా పలకరించి తన దీన స్థితిని వెల్లడించింది.. నక్క పరిస్థితి చూసి పిల్లికి కూడా పాపం జాలి వేసింది.


అలా అయితే నాతో రా పెద్దమ్మ..ఇక్కడికి దగ్గరలో ఒక ఇంటిలో విందు జరుగుతోంది. ఎవరి కంట పడకుండా నెమ్మదిగా ఆ ఇంటి లోకి దూరి మనకు కావలసిన ఆహారం కడుపు నిండా తిని గుట్టుచప్పుడు కాకుండా బయట పడ్డాము అంటూ నక్కతో చెప్పింది పిల్లి. రెండూ కలిసి విందు జరిగే ఇంటి.. కిటికీలో నుంచి నెమ్మదిగా లోపలికి జారుకున్నాయి. పిల్లి ఒక్కొక్క పదార్థాన్ని రుచి చూసి వదిలేసింది కానీ నక్క అత్యాశ పరురాలు కాబట్టి అన్నింటిని పుష్టిగా భుజించింది. ఇంతలో ఏదో అలికిడి కావడంతో పిల్లి చప్పుడు కాకుండా కిటికీలోనుంచి అవతల పడిపోయింది.


నక్క కూడా కిటికీలో నుంచి వెళ్లిపోవాలని  ప్రయత్నించింది.. కానీ ఈ సారి కుదరలేదు. ఎందుకంటే వచ్చేటప్పుడు డొక్కలు నిండిపోయి బక్కగా ఉండడం వల్ల కిటికీలో నుంచి సులభంగా లోపలికి రాగలిగింది.. కానీ చాలా కాలం తర్వాత ఆహారం లభించడంతో పుష్టిగా తిన్న నక్క కిటికీలో నుంచి బయటకు వెళ్లలేకపోయింది. ఇంతలో ఇంటి వాళ్ళు లోపలికి రావడం తో గుడ్లు తేలేసి చచ్చినట్లు నటించింది.. మాయదారి నక్క ఉపాయాన్ని పసిగట్టలేని ఆ ఇంటి వాళ్ళు అయ్యో ఇంట్లో ఏదో నష్టం జరగబోతోంది.. కాబట్టి ఇక్కడ చనిపోయింది అంటూ దానినీ ఈడ్చి అవతల పారేసారు.. ఇక ఒక్కసారిగా లేచి బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి పారిపోయింది నక్క.

మరింత సమాచారం తెలుసుకోండి: