ఒక అడవిలో ఎలుగుబంటి ఒకటి ఉండేది. అది సరదాగా అడవి అంతా తిరుగుతుండేది.. ఒకనాడు అది పాటలు పాడుకుంటూ ఉల్లాసంగా వెతుకుతూ పొరపాటున ఊబిలో పడిపోయింది. ఊబి చాలా లోతుగా ఉంది.ఎలుగుబంటి ఊబీలో కూరుకుపోతూ "అయ్యో! నన్ను రక్షించండి, కాపాడండి"అంటూ గట్టిగా అరిచింది.

అప్పుడు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఆగి చూడగా "నన్ను బయటకు లాగి నా ప్రాణాలు రక్షించు"అని దీనంగా వేడుకుంది ఎలుగుబంటి."నువ్వు ఎలుగుబంటివి.. నిన్ను బయటకు తీశాక నన్ను చంపేస్తావేమో" అన్నాడు అతడు.. "లేదు లేదు నా ప్రాణాలు కాపాడితే నువ్వు నాకు మిత్రుడివి అవుతావు"అంది ఎలుగుబంటి.
ఆ వ్యక్తి ఒక పెద్ద చెట్టు కొమ్మ మీదికి తెచ్చి ఎలుగుబంటి కి అందించి..ఆ ఎలుగు బంటి కొమ్మను పట్టుకోవడంతో  ఆ వ్యక్తి దాన్ని బయటకు లాగాడు.


"నీకు వేల వేల కృతజ్ఞతలు.. నువ్వు ఏం చేస్తూ వుంటావు"? అని అడిగింది ఎలుగుబంటి.
అందుకు ఆ వ్యక్తి "నేనొక రైతును.. నాకు పొలాలు తోటలు ఉన్నాయి"అని చెప్పాడతను.  నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పింది ఎలుగుబంటి.. కొన్నాళ్లకు రైతు అరటి తోట మీద కోతుల దండు ఒకటి దాడి చేసి అరటిపండ్ల చెట్లనంటినీ ధ్వంశం చేయసాగింది. అప్పుడు రైతు ఉపాయం ఆలోచించి అడవికి వచ్చి ఎలుగుబంటి ని తీసుకెళ్లి తోటకు కాపలా పెట్టాడు.

ఎలుగుబంటి ని చూసి కోతులు భయపడి పారి పోయాయి. రైతు అరటి పండ్ల గెలలు అమ్ముకొని దండిగా డబ్బు సంపాదించుకుంటున్నాడు. ఎలుగుబంటి చేసిన సాయానికి రైతు ఎంతో సంతోషించాడు. కాబట్టి కష్టమో.. సుఖమో. ఎవరో ఒకరికి సహాయం చేస్తే మనం చేసిన సహాయం కచ్చితంగా మనకు ఫలితాన్ని ఇస్తుంది. మంచైనా చెడైనా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మనం రక్షించగలిగితే..మన సహాయం పొందిన వారు తప్పకుండా ఏదో ఒక సందర్భంలో మనకు సహాయపడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: