వివాదాల్లో చిక్కుకోవడం అందరికీ సర్వసాధారణం. అలా క్రీడాకారులు కూడా ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. భారత క్రీడా రంగంలో ఇటీవల సంచలనంగా మారిన రెజ్లర్ సుశీల్ కుమార్ ఓ వివాదంలో చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. తోటి క్రీడాకారుడి ప్రాణాలు బలిగొన్న కేసులో సుశీల్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఒలంపిక్స్ కామన్వెల్త్ ఇలా అనేక పోటీల్లో దేశం పేరు గర్వించేలా చేసిన సుశీల్ క్షణికావేశానికి లోనై తోటి రెజ్లర్ పై విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులకు ఇప్పటికే ఆధారాలు లభించాయి. దీంతో సుశీల్ కెరీర్ పూర్తిగా నాశనం అయిపోయిందంటే చెప్పాలి. రెజ్లింగ్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. రైల్వేలో ఉద్యోగం పోయింది. ఏ చత్రసాల్ స్టేడియం అయితే ప్రపంచ స్థాయి రెగ్యులర్ గా తీర్చిదిద్ది అదే స్టేడియం అతని కీర్తి ప్రతిష్టలకు సమాధి కట్టింది.

అలా కొంత మంది క్రీడాకారులు తమ అద్భుతమైన కెరీర్ ని ఆవేశానికి లోనై అధ:పాతాళానికి తొక్కేసుకున్నారు వారెవరో ఇప్పుడు చూద్దాం. క్రీడా లోకంలో వివాదాలతోనే జీవితం గడిపిన వ్యక్తి మైక్ టైసన్. ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో టైసన్ అప్పట్లో ఓ సంచలనం. అప్పటివరకు ఏ బాక్సర్ సాధించని విధంగా ఎన్నో గొప్ప రికార్డును సృష్టించాడు అయితే బాక్సర్ గా ఎంత మంచి పేరున్న అతని అహంకారం ఆగ్రహం ఆ పేరుని దెబ్బతీశాయి. 1996లో హోలీఫీల్డ్ చేతిలో ఓటమి తర్వాత 97 లో ఇద్దరికీ మ్యాచ్ జరిగింది అందులో కూడా హోలీ ఫీల్డ్ గెలుపు అంచుల్లో నిలిచాడు.  దీంతో అవేశం తో హోలీ ఫీల్డ్ చేవి కొరికాడు.  దీంతో ఆ మ్యాచ్ అర్ధాంతరంగా ముగిసింది. టైసన్ ని బాక్సింగ్ నుంచి సస్పెండ్ చేశారు.

ప్రపంచ క్రీడా విశేషాల్లో లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ కెరీర్ పతాక స్థాయికి చేరడం ఆ తర్వాత పతనం కావడం అంత విచిత్రంగానే ఉంటుంది. 1995 2005 మధ్య ప్రపంచ సైక్లింగ్ చరిత్రలో ఓ పెనుసంచలనం ఆర్మ్ స్ట్రాంగ్. 99 లో జరిగిన ఓ రేస్ అనంతరం అతనిపై మాదకద్రవ్యాలను వినియోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి అతని పై నిఘా ఉంచారు. 2005లో స్ట్రాంగ్ సైక్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. మళ్లీ 2009లో తిరిగివచ్చి 2011లో రెండోసారి రిటైర్మెంట్ ప్రకటించాడు అయితే 2012లో అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ విచారణలో డోపింగ్ చేసినట్లు ఆధారాలు లభించాయి.

అమెరికా కు సంబంధించి ఆల్ టైం వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు జాన్ మెక్రెనో,  ఎంఎంఏ ఫైటర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జేసన్ మిల్లర్, నేషనల్ ఫుట్ బాల్ లీగ్ ఆటగాడు ఓవన్స్, బేస్ బాల్ ఆటగాడు ఫీట్ రోజ్, అమెరికా మేజర్ లీగ్ బాస్కెట్ బాల్ ఆటగాడు టై కోబ్, ఓజే సింప్సన్, టిమ్ టెబొవ్, డెన్నిస్ రొడ్మాన్.. ఇలా ప్రపంచ చరిత్రలో చాలా మంది ఆటగాళ్లు తమ ఆవేశాన్ని ఆపుకోలేక తొందరపడి తన కెరియర్ ని జీవితాన్ని నాశనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: