ఇటీవలే భారత క్రికెట్ లో కొత్త శకం మొదలైంది. మొన్నటి  వరకు భారత కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్కప్ తర్వాత t20 కెప్టెన్సీ బాధ్యతలనుంచి వైదొలిగాడు. అదే సమయంలో ఇక హెడ్ కోచ్గా ఉన్న రవి శాస్త్రి పదవీ కాలం కూడా ముగిసింది. దీంతో ఇక టీమిండియాకు పూర్తిస్థాయి కెప్టెన్గా మారిపోయాడు టీమిండియా హిట్ మాన్ రోహిత్ శర్మ . ఇక టీమిండియా కొత్త హెడ్ కోచ్గా భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ పదవీ బాధ్యతలు చేపట్టాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో భారత క్రికెట్ లో కొత్త శకం మొదలైంది అని చెప్పాలి.


 ఇక వీరిద్దరి కాంబినేషన్ శుభారంభం చేసింది. ఇటీవలే న్యూజిలాండ్ జట్టుతో స్వదేశీ గడ్డపై టి20 సిరీస్ ఆడింది రోహిత్ సేన. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఒక కెప్టెన్గా జట్టును ఎంతో సమన్వయంగా ముందుకు తీసుకెళ్లడమే కాదు ఒక ఓపెనర్గా కూడా తన సత్తా ఏంటో చూపించాడు. ప్రతి మ్యాచ్లో కూడా అదరగొట్టి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా అవార్డు దక్కించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా మొదటి టి20 సిరీస్ గెలిచింది.  కెప్టెన్ గా న్యూజీలాండ్ జట్టుపై సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించాడు రోహిత్ శర్మ.


 దీంతో సొంత గడ్డపై ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టును క్లీన్ స్వీప్ చేసింది టీమ్ ఇండియా. వరుసగా 3 టీ20 మ్యాచ్ లో కూడా విజయం సాధించింది. అయితే మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా ఉన్న సమయంలో టీమ్ ఇండియా ఎలాంటి ట్రోఫీని గెలిచినా కూడా కెప్టెన్ ధోనీ ఇక యువ ఆటగాళ్లకుట్రోఫీ ఇచ్చి చివర్లో ఒక చోట నిలబడేవాడు. ఆ తర్వాత కోహ్లీ కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాడు. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఇలాంటిదే చేసాడు. ఇటీవలే టి20 సిరీస్ లో విజయం తర్వాత ట్రోఫీ అందుకున్న అనంతరం దాన్ని తీసుకెళ్లి నేరుగా టీమిండియా లోకి అరంగేట్రం చేసిన యువ ఆటగాళ్లు వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్ చేతులకి అందించాడు. ఆ తర్వాత పక్కన వెళ్లి నిలబడ్డాడు రోహిత్ శర్మ. ఇలా  ధోని లాగే రోహిత్ కూడా చేసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: