ఆసియా కప్ ప్రారంభమైన తర్వాత కేవలం పాకిస్తాన్ భారత్ మ్యాచ్ మాత్రమే ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతుందని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో ప్రతి మ్యాచ్ కూడా పైసా వసూల్ మ్యాచ్ గానే జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక చివరి బంతి వరకు ప్రతి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది తెలియని విధంగా ఉత్కంఠభరితమైన పోరు జరిగింది.  ఇక ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ లు ప్రేక్షకులందరినీ కూడా టీవీలకు అతుక్కుపోయేలా చేసాయి అని చెప్పాలి. కాగా ఇటీవలే సూపర్ 4 లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఏకంగా రణరంగం గానే మారిపోయింది .


 అయితే ఈ మ్యాచ్లో 19ఓవర్ వరకు కూడా అందరూ ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుంది అని గట్టిగా నమ్మారు. ఇలాంటి సమయంలో క్రీజులో ఉన్న పాకిస్థాన్ యువ ఆటగాడు బౌలర్ నసీం  షా ఎవరూ ఊహించని విధంగా రెండు సిక్సర్లు కొట్టి పాకిస్తాన్ జట్టును గెలిపించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో అప్పటి వరకూ కేవలం కొంతమందికి మాత్రమే తెలిసిన నసీం షా ఇక పాకిస్థాన్ జట్టును గెలిపించడం నేపథ్యంలో రాత్రికి రాత్రే స్టార్ క్రికెటర్ గా మారిపోయాడు.  మ్యాచ్ పూర్తయిన అనంతరం పాకిస్థాన్ పేసర్ నసీం షాకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారిపోయింది.



 ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు ను గెలిపించిన తన బ్యాట్ ను వేలం వేసేందుకు సిద్ధమయ్యాడు ఈ యువ ఆటగాడు. అయితే ఆ బ్యాట్ను అతనికి కు అతని సహచరుడు మహమ్మద్ హస్నైన్  బహుమతిగా ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇలా పాకిస్థాన్ జట్టును గెలిపించిన బ్యాట్ను వేలం వేసి ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బుతో సగాన్ని పాకిస్తాన్లోని వరద బాధితులకు సహాయం చేస్తానని తెలిపాడు. ఇక ఈ వేలానికి సంబంధించిన వీడియోని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ వేదికగా వెల్లడించడం గమనార్హం. ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: