కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మరి ముఖ్యంగా ఎక్కడెక్కడ నుంచో జనాలు శ్రీవారిని దర్శించుకోవడానికి రోజుల రోజులు జర్నీ చేసి వచ్చి ఆయన దర్శనం చేసుకుంటూ ఉంటారు.  కానీ అక్కడ తిరుమలలో భక్తుల రద్ది కారణంగా దేవుడిని పట్టుమంటూ పది నిమిషాలు కూడా చూడనివ్వరు. అలా చూసుకుంటూ పోతూ ఉంటారు.  ఒక క్షణం చూసేందుకు గంటల గంటలు క్యూ లైన్ లో వేచి ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుంది.  అయితే శ్రీవారిని మొదటి గడప అనేది చాలా చాలా పవిత్రమైనది . మొదటి గడప అనేది తిరుమల శ్రీవారి స్వామి వారి ఆలయానికి సంబంధించిన పవిత్ర స్థలాలలో ఒకటి .


సాధారణంగా 300 ప్రత్యేక టికెట్లు సర్వదర్శనం భక్తులకు దూరం నుంచి దర్శించుకునేలా ఏర్పాటులు చేస్తారు . కానీ వీఐపీ బ్రేక్ దర్శనం అలాగే శ్రీవారి టికెట్ తో పాటు రకరకాల ప్రత్యేక దర్శన టికెట్లు తీసుకున్న వారికి మొదటి కడప నుంచి స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పుడు టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది . ఇప్పటివరకు వీఐపీలకు మాత్రమే ఇలాంటి దర్శనాన్ని పొందుపరిచిన టిటిడి ఇప్పుడు కామన్ పీపుల్స్ కూడా ఇలా దర్శనం చేసుకునేలా కొత్త రూల్ తీసుకొచ్చింది.  ఇందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లను అందిస్తున్నారు. ఈ టికెట్లు ఏ రోజుల్లో అందుబాటులో ఉంటాయి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి ..? అనేది ఇప్పుడు చదివి తెలుసుకుందాం..!!



టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం ప్రతి నెల 18 తేదీ నుంచి 20 తేది వరకు మొదటి గడప దర్శనం టికెట్ల టోకెన్లు జారీ చేస్తారు.  లక్కీ డిప్లో  మీ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది . ఆ తర్వాత మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే లక్కి  డిప్ ద్వార ప్రకటిస్తారు . ఇందులో చాలా చాలా పోటీ ఉంటుంది.  ఈ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ రెండు నెలలు ముందుగానే చేసుకోవాల్సి ఉంటుంది . ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనాలంటే స్మార్ట్ ఫోన్ లో టిటిడి దేవస్థానం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి . అంతేకాదు మీ మొబైల్ నెంబర్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి .. ఆ తర్వాత హోమ్ పేజీలో కనిపించే  సర్వీసులలో వ్యూ ఆల్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ తర్వాత కనిపించే సేవ ఎడిట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి.

 

అలా చేసుకున్న తర్వాత మీ పూర్తి డీటెయిల్స్ మీ ఐడి కార్డ్ సబ్మిట్ చేయాలి. ఈ టికెట్ కోసం ఇద్దరు వ్యక్తులు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత కంటిన్యూ బటన్ పై క్లిక్ చేస్తే షో సెలెక్టెడ్ సేవ అంటే నెక్స్ట్ ఆప్షన్స్ వస్తుంది . దాని క్లిక్ చేసి మీకు తగిన డేట్ లో టికెట్ బుక్ చేసుకోని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు . చివరిగా రిజిస్ట్రేషన్ సక్సెస్ అనే అలెర్ట్ వచ్చి.. ఆ రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది .. ఒకవేళ లక్కీ డిప్లొ మీరు సెలెక్ట్ అయితే స్క్రీన్ పై చూపిస్తారు .. టైం టు లెఫ్ట్ ఫర్ డ్రా అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ మీరు సేవకు ఎంపిక అయితే మీరు రిజిస్ట్రేషన్ మొబైల్ కు మెసేజ్ కూడా వస్తుంది..!!!

మరింత సమాచారం తెలుసుకోండి: