తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ విలన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు ఫిష్ వెంకట్. ఆయన సినిమాల్లో ఉన్నారు అంటే తప్పకుండా కామెడీ పండుతుంది. అలా వందలాది సినిమాల్లో నటించి మంచి ఆదరణ పొందిన ఫిష్ వెంకట్ తన జీవితాన్ని తానే చేతులారా పాడు చేసుకున్నారు. ఆయన కెరియర్  లో మంచి పొజిషన్ లో కొనసాగుతున్న తరుణంలో చెడు వ్యసనాలకు అలవాటు పడి దారుణంగా ఆరోగ్యం చెడగొట్టుకున్నారు. అలాంటి ఫిష్ వెంకట్ ఈ మధ్యకాలంలోనే అనారోగ్యం సహకరించక ఆసుపత్రిలో కన్నుమూశారు. అయితే ఆయన చనిపోయే చివరి క్షణంలో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే చెడు వ్యసనాలకు బానిసైన ప్రతి ఒక్కరికి కనువిప్పు కలుగుతుందని చెప్పవచ్చు. 

ఇంతకీ ఆయన ఏమన్నారయ్యా అంటే.. గుట్కా తినే వాళ్లు ఎవరైనా సరే తెలుగువారైనా ఇతర వ్యక్తులైన సరే గుట్కా విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. నేను ఆరోగ్యంగా ఉన్న సమయంలో రోజుకు 30 నుంచి 40 గుట్కాలు తినేవాడ్ని. ముఖ్యంగా కచ్చ గుట్కా, పోకలు, జార్జ, సున్నం వేసి తినేవాణ్ణి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా పాన్ మసాలా కూడా అలవాటైపోయింది. అలా ఒక్కొక్కటిగా గుట్కాలకు అలవాటు పడిపోయాను. అలా కొన్నాళ్ల తర్వాత నాకు కనీసం నోట్లో నుంచి మాట కూడా రాలేదు.

 చివరికి ఒక ఆసుపత్రికి వెళ్తే ఆ డాక్టర్ నాకు వైద్యం చేసి గుట్కాలు తినవద్దని చెప్పారు. గుట్కాల వల్ల నా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. డాక్టర్ సూచన మేరకు 30 నుంచి 40 గుట్కాల నుంచి  రోజుకు ఐదు గుట్కాలు బుక్ ఏ స్థాయికి వచ్చాను.. అలా పూర్తిగా గుట్కాలు మానేశాను.. గుట్కా నాకు అలవాటు లేకుంటే నా ఆరోగ్యం  చెడిపోయి ఉండేది కాదని చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా గుట్కాకు ఎవరు కూడా అలవాటు పడవద్దు అని ఆయన చివరి మెసేజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఫిష్ వెంకట్ మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: