
హరి హర వీరమల్లులో పవన్ కళ్యాణ్‌కు జోడిగా నిధి అగర్వాల్ నటించింది. బాబీ డియోల్ విలన్‌గా చేశారు. అయితే పలు నివేదికల ప్రకారం.. పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి రూ. 15 కోట్లు రెమ్యునరేషన్ గా ఛార్జ్ చేశారట. ఆయన తన గత చిత్రం `బ్రో`కు రూ. 50 కోట్లు అందుకున్నాడు. దాంతో పోలిస్తే వీరమల్లు పారితోషికం చాలా తక్కువ. అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడానికి కారణం కూడా లేకపోలేదు.. నిజానికి వీరమల్లు ఎప్పుడో విడుదల కావాల్సిన చిత్రం. పవన్ పాలిటిక్స్ లో బిజీగా మారడం వల్లే దాదాపు రెండేళ్లు డిలే అయింది. ఫలితంగా నిర్మాత ఏఎం రత్నంపై అధిక భారం పడింది. ఆయనకు అండంగా ఉండటం కోసమే పవన్ రూ. 15 కోట్లతో సరిపెట్టుకున్నారని ఇన్‌సైడ్ టాక్ ఉంది.
అలాగే పవన్ కళ్యాణ్ సరసన పంచమి పాత్రలో నిధి అగర్వాల్ మొదటి మహిళా కథానాయికగా నటించింది. నివేదికల ప్రకారం ఈ పాత్ర కోసం ఆమెకు రూ. 2.5 కోట్లు పారితోషికం అందింది. ఇక `డాకు మహారాజ్` తర్వాత బాబీ డియోల్ తెలుగులో నటిస్తున్న రెండో చిత్రం హరి హర వీరమల్లు. అతను మొఘల్ పాలకుడు ఔరంగజేబు పాత్రను పోషించాడు. మెయిన్ విలన్ గా యాక్ట్ చేసినందుకు గానూ బాబీ డియోల్ రూ. 3 కోట్లు ఛార్జ్ చేశారని సమాచారం.