- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్‌లో వినూత్న కథా నేపథ్యంతో తెరకెక్కిన డివోషనల్ సినిమా ‘కన్నప్ప’ ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఎంతో శ్రద్ధతో నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ ఎమోషనల్ సీన్, విష్ణు నటనకు అద్భుతంగా సరిపోయింది. ఆయన పాత్ర శ్రద్ధగా పోషించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. క‌న్న‌ప్ప‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్, డివోషనల్ సినిమాల‌కు ఓ కొత్త దారిని చూపించినట్లుగా సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కనివినీ ఎరుగని విజువల్స్, గ్రాండ్ బిహైవియర్, ఆధ్యాత్మిక‌ అంశాల సమ్మేళనం ఈ సినిమాను మరింత బలంగా నిలిపాయి. థియేటర్లలో విడుదలైన మొదటి వారంలోనే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్ర‌కారం జూన్ 27న థియేటర్లలో విడుదలైన 'కన్నప్ప' సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ దక్కించుకుంది.


ఇక క‌న్న‌ప్ప‌ను అమోజాన్ వాళ్లు జూలై 25న నుంచి స్ట్రీమింగ్‌కు సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అమెజాన్ ప్రైమ్ వీడియో లేదా మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. థియేటర్‌లో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో క‌న్న‌ప్ప ను చూసేందుకు ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా సినిమా కావ‌డం తో 'కన్నప్ప'కు ఇతర భాషల మార్కెట్లలోనూ మంచి స్పందన లభించింది. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయగా, అన్ని భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ఇదే తరహాలో ఓటీటీ ప్లాట్‌ఫారంలోనూ అన్ని భాషల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోందట. ఈ సినిమాలో విష్ణు మంచుతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, సురేష్ గోపీ లాంటి స్టార్ నటులు గెస్ట్ రోల్స్‌లో కనిపించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: