ఇక ఈ ఏడాది ఎన్నో అంచనాల మధ్య రంగంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదటినుంచి పేలవ ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో అయితే మరింత పేలవ ప్రదర్శన కనబరిచింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. కనీసం ప్లే ఆఫ్  నుంచి తప్పుకున్న తర్వాత అయినా చెలరేగి ఆడుతుంది అని అభిమానులు అందరూ భావించారు. కానీ మళ్లీ అదే తప్పిదాలు చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.



 నిన్న ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెత్త ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఏకంగా తొమ్మిది వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేసింది. ఒకానొక దశలో కనీసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 115 పరుగులు చేస్తుందని కూడా అభిమానులు భావించలేదు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం 12.2 ఓవర్ల రోజుల్లోనే ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే, అంతే కాదు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే విజయం సాధించింది  ముంబై ఇండియన్స్ జట్టు.



 అయితే నిన్న జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సీజన్లోనే అతి చెత్త ప్రదర్శన చేసింది కానీ... ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఉన్న ఓ చెత్త రికార్డును మాత్రం సొంతం చేసుకోలేదు అని చెప్పాలి. ఇటీవలే కోల్కతా నైట్ రైడర్స్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మధ్య జరిగిన మ్యాచ్ లో.. పేలవ ప్రదర్శన చేసిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు కేవలం 84 పరుగుల కు మాత్రమే పరిమితం అయిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ స్కోరు నమోదు చేసిన జట్టుగా కేకేఆర్ చెత్త  రికార్డు సొంతం చేసుకుంది. నిన్న చెన్నై కూడా ఇలాంటి రికార్డు సొంతం చేసుకుంటుందని అనుకున్నప్పటికీ చివరకు 115 పరుగులు చేయడంతో చెన్నై ఆ చెత్త రికార్డుని సొంతం చేసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: