ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు మూడు టి20 నాలుగు టెస్ట్ సిరీస్ లు  ఆడనుంది   అయితే మొదటి టెస్ట్ సిరీస్ ప్రారంభంలో ఒక మ్యాచ్ జరగగానే మిగతా మూడు మ్యాచ్లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు అన్న విషయం తెలిసిందే   విరాట్ కోహ్లీ అనుష్క శర్మ జనవరి నెలలో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో ఆ సమయంలో భార్య కు తోడుగా ఉండాలని భావించిన విరాట్ కోహ్లీ బిసిసిఐ ముందు పితృత్వ సెలవులకు దరఖాస్తు చేసుకోవడంతో బిసిసిఐ బోర్డు కూడా సానుకూలంగా స్పందించింది ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఒక మ్యాచ్ తర్వాత  అందుబాటులో ఉండకుండా భారత్ రానున్నాడు.



 విరాట్ కోహ్లీ లేకుండా భారత జట్టు ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ ఆడటంపై ప్రస్తుతం ఎంతోమంది మాజీలు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పై ప్రశంసలు కురిపించిన మైకేల్ క్లార్క్.. మొదటి టెస్ట్ మ్యాచ్ తర్వాత  మిగతా మూడు మ్యాచ్ లకి విరాట్ కోహ్లీ దూరం కావడం భారత్కు పెద్ద లోటు అంటూ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు అంటూ ప్రశంసించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్.. మొదటి టెస్ట్ తర్వాత విరాట్ కోహ్లీ భారత్ బయలుదేరడం టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ అంటూ చెప్పుకొచ్చాడు.



 విరాట్ కోహ్లీ లేకుండా ఆస్ట్రేలియా జట్టును ఓడించడానికి ఎంతో కష్టం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. వన్డే సిరీస్ టి20 సిరీస్ లలో  భారత్ విజయాలు సాధించాలని ఆ విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసాన్ని టెస్టుల్లో  కొనసాగించాలంటూ సూచించాడు. కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడం భారత్కు అసాధ్యం అంటూ వ్యాఖ్యానించిన క్లార్క్.. కోహ్లీ జట్టులో ఉంటే  టీమిండియాకు ఎంతో బలంగా ఉంటుంది అన్నాడు.   ప్రస్తుతం ధోనీ కెప్టెన్గా ఉన్నప్పటికీ నేను ఇదే మాట చెప్పే వాడిని అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్.

మరింత సమాచారం తెలుసుకోండి: