ఇండియన్ క్రికెట్ టీం అంటే ముందుగా గుర్తువచ్చే పేరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితె కోహ్లి మరో మైలురాయి ని అధిగమించాడు.ఆస్ట్రేలియాతో ఆదివారం  జరిగిన రెండవ 50 ఓవర్ల మ్యాచ్ లో విరాట్ కోహ్లి 87 బంతుల్లో 89 రన్నులు చేసాడు.ఈ మ్యాచ్ లో 78 పరుగులు ముగిసిన తరువాత కోహ్లీ అత్యంత వేగంగా 22000 వేల రన్నులు చేసిన బాట్స్మన్ లలో క్రికెట్ దేవుడు గా భావించే సచిన్ టెండూల్కర్ మీద వున్న రికార్డ్ ను అధిగమిoచాడు.కోహ్లీ ఈ రికార్డ్ ను కేవలం 462 మ్యాచ్ లలో సాధించగ సచిన్ టెండూల్కర్ ఈ రికార్డ్ ను 493 మ్యాచ్ లలో సాధించాడు.

దీనీతో సచిన్ పేరు మీద ఉన్న రికార్డ్ ను కోహ్లి 31 మ్యాచ్ లకు ముందుగానే సాధించాడు.అయితే ఈ రికార్డు ని సాధించిన వారిలో బ్రియాన్ లారా 511 ఇన్నింగ్స్ లలో సాధించగా రికీ పాంటింగ్ 514 ఇన్నింగ్స్ లో సాధించాడు.అయితే ఈ రికార్డ్ ని సాధించిన ఇండియన్ బాట్స్మన్ లలో మూడవ బాట్స్మన్ గా నిలవగా ప్రపంచ క్రికెట్ బ్యాట్సమెన్లలో 8 వ బాట్స్మన్ గా నిలిచాడు.

ఇండియన్ బాట్స్మన్ లలో సచిన్ మరియు రాహుల్ ద్రవిడ్ ఉన్నారు.అయితే ఈ లిస్ట్ లో సచిన్ టెండూల్కర్ 34357 రన్నులను 782 మ్యాచ్ లలో సాధించి మొదటి బాట్స్మన్ గా నిలిచాడు.తరువాత స్థానం లో కుమార సంగక్కర 28016, రికీ పాంటింగ్ 27483,మహేళ జయవర్ధనే 25957, కలిస్ 25534, రాహుల్ ద్రవిడ్ 24208, లారా 22358 వున్నారు.ఈ లిస్ట్ లో 3 ఇండియన్ బ్యాట్సమెన్లు వుండగా 2 శ్రీ లంక బాట్స్మన్ మరియు ఒక ఆస్ట్రేలియా,సౌత్ ఆఫ్రికా,వెస్ట్ ఇండియన్ బాట్స్మన్ లు ఉన్నారు.

అయితే ఇందులో కేవలం విరాట్ కోహ్లి మాత్రమే సగటు 50 స్కోర్ కు పైగా  56.15 ఉండగా తర్వాత స్థానం లో కలిస్ 49.10 రన్నుల సగటు తో రెండవ స్థానంలో ఉన్నాడు.అందుకే విరాట్ కోహ్లి ని ఇండియన్ రన్ మెషీన్ గా పిలుస్తారు.50 ఓవర్ల మ్యాచ్ ల్లో కోహ్లీ 241 ఇన్నింగ్స్ ఆడి 11977 రన్నులు చేసాడు.దాదాపుగా 59.29 సగటు తో 93.32 స్ట్రైక్ రేట్ తో 43 సెంచరీలు సాధించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: