మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియాలో అసలుసిసలైన ఫినిషేర్  ఎవరు అనే దానిపై చర్చ కొనసాగింది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది ఆటగాళ్లు ఐదవ స్థానంలో ఆడినప్పటికీ కూడా ఎవరూ కూడా నిలకడగా రాణించలేకపోయారు. అయితే టీమిండియాలో ఫినిషర్ గా మహేంద్ర సింగ్ ధోనీ లేని లోటును ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం పూడ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయిన రవీంద్ర జడేజా ప్రతి మ్యాచ్లో కూడా కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇక ఇటీవలే హార్దిక్ పాండ్యా తో కలిసి ఆరో వికెట్కు అజేయంగా 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి  ఆశ్చర్యపరిచాడు రవీంద్ర జడేజా.



 అంతేకాదు మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఎంతో ఓపిక పట్టి క్రీజ్లో చివరి వరకు నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు రవీంద్ర జడేజా. ఇటీవల తొలి టీ-20 మ్యాచ్లో కూడా ఆఖరివరకు క్రీజ్లో నిలిచి టీమిండియాకు మెరుగైన స్కోర్ అందించడంలో కీలక పాత్ర వహించాడు. కేవలం 23 బంతుల్లోనే 44 పరుగులు చేసి వీరోచిత పోరాటం చేశాడు రవీంద్ర జడేజా. కాగా తొలి టీ-20 మ్యాచ్లో 11 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టు ఓటమిపాలైంది అనే విషయం తెలిసిందే. అయితే 7 వ స్థానంలో బ్యాటింగ్కు వెళ్లి 23 బంతుల్లో 44 పరుగులు చేసిన రవీంద్ర జడేజా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 8 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు.



 2012 సంవత్సరంలో ఇంగ్లాండ్ తో  జరిగిన టి20 మ్యాచ్ లో ఏడవ స్థానంలో బ్యాటింగ్కు వెళ్ళిన మహేంద్రసింగ్ ధోని.. 18 బంతుల్లో 38 పరుగులు చేశాడు... ఇలా అంతర్జాతీయ టీ20ల్లో ఏడవ స్థానంలో బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగాడు  మహేంద్రసింగ్ ధోని. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో 23 బంతుల్లో... 44 పరుగులు చేసి ఆ రికార్డును రవీంద్ర జడేజా బద్దలు కొట్టాడు. కాగా ప్రస్తుతం టీమిండియాలో ఎంతో అద్భుతంగా రాణిస్తూ నిలకడగా రాణిస్తున్నాడు రవీంద్ర జడేజా. అంతేకాదు భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడం  లో కూడా కీలకపాత్ర వహిస్తూ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: