ప్రస్తుతం భారత క్రికెట్ లో లెజెండరీ క్రికెటర్ గా కొనసాగుతున్న వారు ఎంతో మంది ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా భారత క్రికెట్ లో  లెజండరీ క్రికెటర్ లాగా కొనసాగుతున్న వారిలో ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టులో సేవలు అందించి తన లెగ్ స్పిన్ భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించి దిగ్గజ క్రికెటర్ గా ఎదిగిన బిఎస్  చంద్రశేఖర్ కూడా ఒకరు అనే విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్ లో కీలక పాత్ర వహించారు బిఎస్ చంద్రశేఖర్. ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకుల ప్రేమాభిమానాలను కూడా సంపాదించుకున్నారు.



 అయితే ఇటీవలే భారత మాజీ లెజెండరీ లెగ్ స్పిన్నర్ బి ఎస్ చంద్రశేఖర్ అస్వస్థతకు గురయ్యారు.  ఈ క్రమంలోనే ఆయనను కుటుంబ సభ్యులు బెంగళూరు లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు బి ఎస్ చంద్రశేఖర్.  ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అభిమానులు కంగారు పడాల్సిన పని లేదని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు అంటూ తెలిపారు.



 టీవీలో క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆయసం రావడమే కాదు మాట తడబడటం తో వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు కూడా తెలిపారు.  అభిమానులందరూ లెజెండరీ క్రికెటర్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. లెజెండ్రీ లెగ్ స్పినర్ చంద్రశేఖర్ 58 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. యావరేజ్ రన్ రేటు 29.74 శాతంగా ఉంది. 1961 జనవరిలో ఆయన క్రెకెట్‌ టీమ్‌లోకి అడుగుపెట్టి 1979లో చివరి మ్యాచ్ ఆడారు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్‌డే ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ కూడా ఆడారు. ఆ మ్యాచ్‌లో 36 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: