విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మన్గా కొనసాగుతున్నాడు. మొన్నటివరకు టీమిండియా కెప్టెన్ గా కొనసాగిన విరాట్ కోహ్లీ ఇక ఇటీవల కెప్టెన్సీకి స్వస్తి పలికాడు అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం టీమిండియా లో కేవలం ఒక కీలక ఆటగాడిగా మాత్రమే విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. అయితే విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు ఎన్నో రికార్డులను సృష్టించాడు. దిగ్గజ క్రికెటర్ సృష్టించిన రికార్డులను తక్కువ సమయంలోనే తిరగరాసి తన పేరును లిఖించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఒకసారి విరాట్ కోహ్లీ మైదానంలో కుదురుకున్నాడు అంటే చాలు బౌలర్ల వెన్నులో వణుకు పుడుతు ఉంటుంది.


ఒకసారి విరాట్ కోహ్లీ బ్యాట్ జులిపించాడు అంటే చాలు స్కోర్ బోర్డ్ సైతం పరుగులు పెట్టి అలసిపోతుంది. అందుకే అభిమానులు అందరూ కూడా విరాట్ కోహ్లీని పరుగుల యంత్రం అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. మరి కొంతమంది రికార్డుల కింగ్ అంటూ విరాట్ కోహ్లీ అని పిలుస్తూ ఉంటారు. ఇక భారత జట్టు తరఫున మొన్నటివరకు కెప్టెన్గా ఆటగాడిగా కూడా అద్భుతంగా రాణిస్తూ ప్రపంచ క్రికెట్లో సత్తా చాటాడు  . దీంతో  భారత ప్రేక్షకులు మాత్రమే కాదు కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. దాయది దేశమైన పాకిస్థాన్లో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల విరాట్ కోహ్లీ ఆటతీరుపై స్పందించిన పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ యుగానికి విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్ మెన్ అంటూ మహమ్మద్ అమీర్ చెప్పుకొచ్చాడు. కోహ్లీ బౌలింగ్ చేయడం తనకు ఎప్పుడూ కష్టంగా అనిపించలేదు అంటూ తెలిపాడు. ఆ విషయానికి వస్తే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ కి పోలింగ్ చేయడం కష్టంగా అనిపించిందని తెలిపాడు మహమ్మద్ అమీర్.. కాగా 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో విరాట్ కోహ్లీని మహమ్మద్ అమీర్ ఔట్ చేసి వికెట్ తీశాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: