మొన్నటివరకు టీమిండియా టెస్టు కెప్టెన్ గా  కొనసాగిన విరాట్ కోహ్లీ ఇటీవల షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న అంటూ నిర్ణయం తీసుకొని అందరిని అవాక్కయ్యేలా చేశారు. విరాట్ కోహ్లీ ఫిట్నెస్ దృశ్య ఇప్పట్లో అసలు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం కలలో మాటే అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించటంతో అందరూ షాక్ అయ్యారు. కోహ్లీ ఏంటి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంఏంటి ఇది నిజమేనా అది కొన్ని రోజుల వరకు అస్సలు నమ్మలేదు. కానీ ఆ తర్వాత బిసిసిఐ కొత్త కెప్టెన్గా రోహిత్ శర్మనూ నియమిస్తూ ప్రకటన చేయడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.


 టి 20 లోనుంచి తప్పుకున్నప్పటికి విరాట్ కోహ్లీ వన్డేలకు టెస్టులకు కెప్టెన్గా కొనసాగుతాడు అని అందరూ అనుకుంటే అంతలో బీసీసీఐ  షాక్ ఇచ్చింది. వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది.ఇది ఒక చిన్న మారిపోయింది. ఇలా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంతో విరాట్ కోహ్లీ మనసు బాధ పడింది అని ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక కనీసం టెస్టు కెప్టెన్గా అయినా సరే విరాట్ కోహ్లీ కొనసాగుతాడు అని అనుకున్నప్పటికీ సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ను ఓడిపోగానే టెస్ట్ కెప్టెన్సీకి  గుడ్ బై చెప్పేసి విరాట్ కోహ్లీ షాకిచ్చాడు.



 దీంతో విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ఇక ఇటీవలే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ మరో రెండేళ్ల పాటు భారత టెస్ట్ కెప్టెన్ గా  కొనసాగితే బాగుండేది  అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటు కోహ్లీ తీసుకునే నిర్ణయాన్ని ఇక మనమంతా గౌరవించాల్సిన అవసరం ఉంది అంటూ తెలిపాడు. కాగా గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో మొత్తం అటు కోచ్గా రవిశాస్త్రి వ్యవహరించాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: