ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా సత్తా చాటుతూ దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రదర్శన చూసిన తర్వాత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. సరిగ్గా ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన 2008లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతంగా రాణించి షైన్ వార్న్  సారధ్యంలో ఫైనల్కు చేరింది. ఇక ఫైనల్ లో కూడా కప్పు కొట్టి ఐపీఎల్ లో మొట్టమొదటి విజేతగా కూడా రికార్డు సృష్టించింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. కానీ ఆ తర్వాత మాత్రం తన ప్రాబల్యం కోల్పోయింది. ఇక ఆ తర్వాత జరిగిన అన్ని సీజన్లలో పాల్గొన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎక్కడ సత్తా చాట లేకపోయింది. ఎంతలా అంటే రాజస్థాన్ రాయల్స్ రాణించి ప్లే ఆఫ్లో స్థానం సంపాదించుకోవడమే గొప్ప అనేంతగా పేలవ ప్రస్థానాన్ని కొనసాగించింది.


 కానీ ఇప్పుడు ఐపీఎల్ లో మొదటి సీజన్ గెలిచిన తర్వాత దాదాపు 14 ఏళ్ళకే మరోసారి సత్తా చాటింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ప్రతి ఏడాది నిరాషలో మునిగిపోతున్న అభిమానులందరికీ కూడా కొత్త ఊపిరి పోసింది. ఈ ఏడాది ఐపీఎల్ లో మొదటి నుంచి అద్భుతంగా రాణిస్తూ వచ్చిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదటి క్వాలిఫైయర్ గుజరాత్ చేతిలో ఓడిపోయింది. కానీ ఇటీవల జరిగిన రెండో క్వాలిఫయర్లో మాత్రం బెంగళూరు జట్టుపై ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ఇక నేరుగా ఫైనల్ లోకి వెళ్ళింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. దీంతో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగి పోయి ఎగిరి ఎగిరి గంతేస్తున్నారు  అని చెప్పాలి. ఇలా తొలి ఐపీఎల్ సీజన్ లో షేన్వార్న్ నేతృత్వంలో ట్రోఫీని కైవసం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు పద్నాలుగేళ్ల తర్వాత ఫైనల్కు అర్హత సాధించడం గమనార్హం. ఇన్నేళ్లలో ప్లే అప్ లో చోటు దక్కించుకోవడానికి  కూడా ఇబ్బంది పడిన రాజస్థాన్ రాయల్స్ షేన్ వాట్సన్, రాహుల్ ద్రవిడ్, స్మిత్, రహానే కెప్టెన్సీ లో సాధ్యం కానిది ఇక ఇప్పుడు సంజు శాంసన్  సాధించి చూపించాడు. ఇకపోతే ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలా రాణించ బోతుంది  అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఒకవైపు రాజస్థాన్ మరోవైపు గుజరాత్ జట్లు కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తున్నాయ్. దీంతో రేపు జరగబోయే మ్యాచు ఎంతో ఉత్కంఠగా మారబోతున్నాయ్..

మరింత సమాచారం తెలుసుకోండి: