కరోనా వైరస్ కారణంగా క్రికెటర్లు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఎంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో క్రికెట్ ఆడిన ఆటగాళ్లు ఇక ఇప్పుడు మాత్రం కరోనా వైరస్ కారణంగా కేవలం హోటల్ గదికి మాత్రమే పరిమితం అవుతున్నారు. కఠినమైన నిబంధనలు మధ్య క్వారంటైన్ లో ఉంటూ క్రికెట్ మ్యాచ్లు ఆడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అటు ఎంతో మంది ఆటగాళ్లు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇటీవలి కాలంలో అయితే టీమిండియాను కరోనా వైరస్  దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంది.


 ప్రస్తుతం ఇండియా జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరగా ఈ పర్యటనకు ముందే కీలక ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వైరస్ బారిన పడ్డాడు. ఇక ఆ తర్వాత టీమిండియా ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్న సమయంలో కోహ్లీ కూడా కరోనా వైరస్ బారిన పడటం గమనార్హం. ఇక ఇప్పుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వైరస్ బారిన పడ్డాడు అన్నది తెలుస్తుంది. దీంతో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగి పోతున్నారు. ఇటీవల నిర్వహించిన రాపిడ్ టెస్ట్ రిజల్ట్స్ లో రోహిత్ శర్మ కి కరోనా పాజిటివ్ గా తేలింది.


 ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం జట్టు నుంచి దూరంగా ఐసోలేషన్ లో ఉన్నాడు అనేది తెలుస్తుంది. కాగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జూలై 1వ తేదీ నుంచి నిర్ణయాత్మకమైన టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. ఈ క్రమంలోనే అప్పటివరకు రోహిత్ శర్మ కరోనా వైరస్ బారి నుంచి కోలుకుంటాడ లేదా అన్నది అనుమానంగానే మారిపోయింది.  ఈ క్రమంలోనే అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోతున్నారు. అయితే గత ఏడాది టీమిండియా ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడటం  ఈ కారణంగానే  ఐదవ టెస్ట్ మ్యాచ్ రద్దు అయ్యింది. ఇప్పుడు ఇన్నాళ్లకు ఆ మ్యాచ్ ని రీషెడ్యూల్ చేయగా ఇప్పుడు కూడా కరోనా ఇబ్బందులు తప్పడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: