ప్రస్తుతం ఇంగ్లాండ్ క్రికెట్ లో స్టార్ బ్యాట్స్మెన్ గా జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న కెప్టెన్ గా కొనసాగుతున్న ఇయాన్ మోర్గాన్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటిస్తు షాకింగ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ళపాటు ఇయాన్ మోర్గాన్ ప్రపంచ క్రికెట్లో కొనసాగుతాడని అభిమానులందరూ కూడా భావించారు. కానీ గత కొంత కాలం నుంచి పేలవమైన ఫాం తో ఇబ్బంది పడుతున్న ఇయాన్ మోర్గాన్ ఎవరూ ఊహించని విధంగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు.


 అయితే  ఇయాన్ మోర్గాన్ ఐర్లాండ్ క్రికెటర్ అయినప్పటికీ అటు ఇంగ్లాండ్ క్రికెట్ ద్వారానే ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇంగ్లాండ్ క్రికెట్ లో స్టార్ క్రికెటర్ గా ఎదిగిన ఇయాన్ మోర్గాన్ ఆ తర్వాత కాలంలో ఏకంగా జట్టుకు కెప్టెన్సీ పగ్గాలు కూడా అందుకున్నాడు అని చెప్పాలి. అతని కెప్టెన్సీలో ఒకసారి ఇంగ్లాండ్ జట్టు విశ్వవిజేతగా కూడా నిలిచింది. ఇకపోతే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం పై స్పందించిన ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి.


 తాను సరైన సమయంలో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినట్టు భావిస్తున్నాను అంటూ ఇయాన్ మోర్గాన్ చెప్పుకొచ్చాడు. రెండు సార్లు ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉండటం తన అదృష్టమని తెలిపాడు. వైట్ బాల్ క్రికెట్ లో ఇంగ్లాండ్ భవిష్యత్తు గతంలో కంటే ఎంతో మెరుగ్గా ఉంటుందని తాను భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రిటైర్మెంట్  ప్రకటించిన నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు కి కొత్త కెప్టెన్గా ఎవరు రాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇటీవలే టెస్టు జట్టుకు కెప్టెన్సీ లో కూడా మార్పులు జరిగి  అటు బెన్ స్టోక్స్ కొత్త టెస్ట్ కెప్టెన్ గా అవతరించాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: