సూర్య కుమార్ యాదవ్.. గత కొంతకాలం నుంచి క్రీడా ప్రపంచంలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యువ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రతి మ్యాచ్లో కూడా అదరగొడుతూనే ఉన్నాడు. దీంతో అందరూ అతని గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తన బ్యాటింగ్ తో సునామీ సృష్టిస్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఉప్పల్లో సునామీ ఇన్నింగ్స్ తో అదరగొట్టిన సూర్య కుమార్ యాదవ్.. ఇటీవల సౌత్ ఆఫ్రికా పై థండర్ ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందించాడు.


 ఇక తద్వారా తన బ్యాటింగ్ తో ఎప్పుడు జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తూనే ఉన్నాడు అని చెప్పాలి. దీంతో క్రీడా ప్రపంచం మొత్తం అతని బ్యాటింగ్కు ఫిదా అవుతూ ప్రశంసలు కురిపిస్తూ ఉంది. ఇప్పుడు సూర్య కుమార్ యాదవ్ సహచర ఆటగాడు టీమిండియా వైస్ కెప్టెన్ కే ఎల్ రాహుల్ సైతం సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ కి ఫిదా అయిపోయాను అంటూ చెప్పుకొచ్చాడు. అప్పటివరకు నేను సింగిల్స్ తీయడానికే ఎంతో కష్ట పడిపోతూ ఉన్నాను.  అలాంటి సమయంలో క్రీజు లోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ మాత్రం వచ్చి రాగానే సిక్సర్లు బాధటం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ చెప్పుకొచ్చాడు కేఎల్ రాహుల్.


 అంతేకాదు సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ లో ఆడిన షాట్లు అస్సలు నమ్మశక్యంగా లేవు. ఇక అతడు ముందే అనుకొని బ్యాటింగ్కు దిగాడు.  భారీ షాట్లు ఆడాలని అనుకున్నాడు దానికి తగ్గట్లుగానే అతను తన ప్లాన్ అమలు చేశాడు. అయితే ఇది ఎంతో కఠిన తరమైన పిచ్.  దీని మీద సింగిల్స్ తీయడమే కష్టం. కానీ ఇలాంటి సమయంలో సూర్య కుమార్ ప్రత్యర్థి  బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. సౌత్ ఆఫ్రికా తో మొదటి టి20 మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ నాకన్నా బాగా ఆడాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఈ పిచ్ పై అటాకింగ్ గేమ్ ఆడటం కష్టం. కానీ సూర్య కుమార్కు అవన్నీ కనిపించవు. అతడి ఆట అతడితే అంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు కేఎల్ రాహుల్.

మరింత సమాచారం తెలుసుకోండి: