గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో టీమిండియా కీలక బౌలర్ అయిన బుమ్రా గురించి చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. జస్ ప్రీత్ బూమ్రా జట్టుకు దూరమయ్యాడు అని కొంతమంది చర్చించుకుంటే అతను లేకుండా టీమిండియా ఎలా రానిస్తుందో అని మరి కొంతమంది చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇంకొంతమంది బుమ్రా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే గాయం బారిన పడ్డాడని ఇక ఇప్పుడు అతను గాయం బారిన పడి చివరికి టీమిండియాను కష్టాల్లోకి నెట్టాడు అంటూ విమర్శలు చేయడం కూడా మొదలుపెట్టారు ఎంతోమంది.



 ఇక ఇలా మొన్నటి వరకు బుమ్రా గాయం విషయంలో ఉన్న సానుభూతి కాస్త రోజురోజుకు నెగిటివిటి గా మారిపోతుంది అని చెప్పాలి   అయితే సాధారణంగా క్రికెటర్ల పై ఇలాంటి విమర్శలు రావడం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది   అయితే కొంతమంది క్రికెటర్లు తమపై వచ్చిన విమర్శలకు ఘాటుగానే స్పందిస్తూ రిప్లై ఇవ్వడం లాంటివి చేస్తుంటారు. మరి కొంతమంది క్రికెటర్లు మాత్రం ఎన్ని విమర్శలు వచ్చినా చూసి చూడనట్లుగా వదిలేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు బుమ్రా మాత్రం తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు.



 తన సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న విమర్శల గురించి స్పందిస్తూ విన్ స్టన్ చర్చిల్ చెప్పిన ఒక కొటేషన్ రాసుకొచ్చాడు. మొరిగే ప్రతి కుక్కపై రాళ్లు వేసేందుకు ఆగితే నువ్వు నీ గమ్యాన్ని ఎప్పటికి చేరుకోలేవు అనే అర్థం వచ్చేలా కొటేషన్ ఉంది. అయితే ఇది తనపై విమర్శలు చేస్తున్న వారికి బుమ్రా ఇచ్చిన కౌంటర్ అని అభిమానులు భావిస్తున్నారు. సూపర్ రిప్లై ఇచ్చావు బుమ్రా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనారు. ఇకపోతే వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా. అటు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో ఉండబోతున్నాడు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: