ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 23వ తేదీన జరిగిన భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ను ఇప్పటికి కూడా క్రికెట్ ప్రేక్షకులు మరిచిపోలేదు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఊహకందని రీతిలో ఎంటర్టైన్మెంట్ అందించిన ఈ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది అని చెప్పాలి. ఇక చివరి బంతి వరకు కూడా విజేత ఎవరో అన్న విధంగా సాగిన ఈ మ్యాచ్లో చివరికి భారత జట్టు విజయం సాధించి ఇక చిరకాల ప్రత్యర్థి అయిన  పాకిస్తాన్ పై ఆదిపత్యం చెలాయించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


  టి20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ జట్టుపై భారత జట్టు విజయం సాధించింది అంటే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చలవే అని చెప్పాలి. ఎందుకంటే ఎంతో ఒత్తిడి ఉన్న సమయంలో కనీసం సింగిల్స్ తీయడానికి కూడా అందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు  విరాట్ కోహ్లీ మాత్రం సిక్సర్లతో చెలరేగి పోయాడు. ఒక్కసారిగా గేర్ మార్చి జట్టును విజయం  వైపుకు నడిపించాడు. ఇకపోతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో హరీష్ రావుఫ్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ కొట్టిన రెండు సెక్షర్లు మాత్రం మ్యాచ్ మొత్తానికి హైలైట్ గా నిలిచాయి అని చెప్పాలి..


 ఇక ఈ విషయంపై స్పందించిన ఎంతో మంది మాజీ ఆటకాలు కోహ్లీ బ్యాటింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఇక ఇటీవల విరాట్ కోహ్లీకి రెండు సిక్సర్లు సమర్పించుకున్న పాకిస్తాన్ స్టార్. బౌలర్ హరీష్ రావు స్పందించాడు విరాట్ కోహ్లీ తన బౌలింగ్లో రెండు సిక్సర్లు కొట్టినందుకు తాను బాధపడలేదు అంటూ తెలిపాడు. కోహ్లీ ఒక మాస్టర్ క్లాస్ బ్యాటర్, అందుకే అతడు కొట్టిన పెద్దగా బాధనిపించలేదు. విరాట్ కోహ్లీ కాకుండా హార్దిక్ పాండ్యా దినేష్ కార్తీక్ లలో ఎవరు రెండు సిక్సర్లు కొట్టిన బాధపడే వాడిని అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: