బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అటు ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని సీజన్ల నుంచి కూడా అటు భారత జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పూర్తి అధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇక వరుసగా మూడుసార్లు సిరీస్ ను కైవసం చేసుకుంది అని చెప్పాలి. ఇక వారి సొంత గడ్డపై కూడా ఆస్ట్రేలియా జట్టును ఓడించి చరిత్ర సృష్టించిన విషయం ఇప్పటికీ భారత క్రికెట్ ప్రేక్షకులు మరిచిపోలేదు.


 అయితే ఇక ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మకమైన టెస్ట్ సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి కూడా అటు ఆస్ట్రేలియా జట్టు మైండ్ గేమ్ ప్రారంభించింది. ముఖ్యంగా భారత్ లో ఉండే పిచ్ లపై ఇప్పటివరకు ఎవరు మాట్లాడనన్ని మాటలు ఆస్ట్రేలియా మాజీ ఆటగాల్లు మాట్లాడారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత జట్టుకు అనుకూలంగా ఉండే విధంగానే ఇక పిచ్ లను తయారు చేసుకునే అవకాశం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.


 సరిగ్గా మ్యాచ్ కు రెండు రోజుల ముందు పిచ్ సెంటర్లో వాటర్ కొట్టడంతో అసలు సమస్య మొదలయింది. లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాటింగ్ చేసే లెగ్ స్టంప్ వైపు కూడా మరోసారి నీళ్లు కొట్టి రోలింగ్ చేశారు   దీని పై స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా ఈ విషయాన్ని తప్పు పట్టింది  తమకు అనుకూలంగా పిచ్ తయారు చేసుకోవడం మంచిదే కానీ ఇలా పదే పదే పిచ్ ను నీళ్లతో తడపడం అస్సలు నచ్చలేదని ఇదొక డాక్టర్డ్ పిచ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. స్మిత్ సైతం ఇక ఇదే విషయంపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి.  ఈ విషయంపై స్పందించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. నాగ్ పూర్ పిచ్ పై ఆస్ట్రేలియా క్రికెట్ చేస్తున్న ఆరోపణలు వింతగా ఉన్నాయి. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడం కోసమే వాటర్ కొట్టి మిషన్ తో ఎక్కువసార్లు రోలింగ్ చేశారు. అనవసరంగా దీనిని పెద్ద విషయం చేస్తున్నారు. పిచ్ గురించి మాట్లాడటం మానేసి ఆటపై ఫోకస్ చేయండి అంటూ రోహిత్ కౌంటర్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: