ఇటీవల కాలంలో ఏ ఇండస్ట్రీలో చూసిన అటు మల్టీస్టారర్ సినిమాల హవా బాగా పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది దర్శకులు మల్టీస్టారర్ లు తీయకపోయినా ఇక సినిమాలో ఏదో ఒక కీలకమైన పాత్ర కోసం ఇతర స్టార్ హీరోలను తీసుకొని కామియో రోల్స్ తో అటు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్ తో పాటు మోహన్లాల్ కూడా ఇలాంటి క్యామియో రోల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అన్న విషయం తెలిసిందే.



 ఇక ఇటీవల కాలంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కూడా కామియో రోల్స్ తో ఆకట్టుకున్నాడు. గతంలో విక్రమ్ సినిమాలో సూర్య చేసిన క్యామియో పాత్ర అయితే ఎంతలా హీట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే జైలర్ సినిమాలో ఇలాంటి క్యామియో రోల్ లో నటించిన తర్వాత శివరాజ్ కుమార్ కి ఇతర హీరోల సినిమాల నుంచి కూడా ఇలాంటి ఆఫర్లు వస్తూ ఉన్నాయి.  ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న ఓ మూవీలో కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నాడట శివన్న.


 అంతేకాదు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో కూడా ఒక స్పెషల్ రోల్లో నటిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలోకి గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. తర్వాత బుచ్చిబాబు సనాతో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే గతంలో బుచ్చిబాబు ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి నటించినట్టుగానే ఇక ఇప్పుడు చరణ్ సినిమాలో శివరాజ్ కుమార్  నటిస్తున్నాడు అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతుంది.


 అయితే ఇదే విషయంపై ఇటీవల శివరాజ్ కుమార్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రామ్ చరణ్ గురించి ఇంకా ఏమీ చెప్పలేను. దీని గురించి కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీని గురించి ఏం మాట్లాడలేను. ఇప్పుడే మాట్లాడి ఏం చేయకపోతే అభిమానులు నిరాశ పడతారు. అయితే బుచ్చిబాబు నన్ను కలవాలని కోరాడు. కానీ ఏం జరుగుతుందో చూద్దాం అంటూ శివరాజ్ కుమార్ కామెంట్స్ చేయడంతో.. ఇక చరణ్ సినిమాలో శివన్న నటించడం ఖాయం అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇటీవల హీరో నాని కూడా శివన్నను కలిశాడు. దీంతో ఇక నాచురల్ స్టార్ సినిమాలో కూడా శివన్న ఒక అతిధి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: