మనుషులు ఎలా మారారంటే తమ అవసరాలకు వాడుకోవడంలో ఎంతటికైన తెగిస్తారు.. అయితే తెలుగులో సక్సెస్ ఫుల్ గా ప్రసారమవుతున్న బిగ్ బాస్ లో పులిహోర కలపడం ఎక్కువైంది.. ఒక అమ్మాయికోసం ముగ్గురు అబ్బాయిలు వరుసలో ఉన్నారు. ఇంకా అర్ధం కాలేదా.. అదే మోనాల్ పాప.. బిగ్ బాస్ దత్త పుత్రిక.. ఈ అమ్మడు టాస్క్ లు చేయడం తక్కువ రొమాన్స్ చేయడం ఎక్కువ. మొదట్లో అభిజిత్ తో రొమాన్స్ చేయాలనుకుంది.. కానీ కుదరలేదు..తర్వాత లవర్ బాయ్ అఖిల్ తో సెటిల్ అయ్యింది. అర్థ రాత్రి రొమాన్స్ చేస్తూ బిజీగా ఉంది. 



అయితే ఈ మధ్య అఖిల్-మోనాల్‌ల మధ్య గొడవలు మొదలయ్యాయి. మోనాల్‌ని రెండుసార్లు నామినేట్ చేయడమే కాకుండా.. నేను లేకపోతే మోనాల్‌లే లేదని అఖిల్ అనడంతో మోనాల్ ఇగో హర్ట్ అయ్యింది. దీంతో వీళ్ల లవ్ ట్రాక్ స్పీడ్ బ్రేకర్ వేశారు బిగ్ బాస్. కాగా , బిగ్ బాస్ షో లో లవ్ బర్డ్స్ మద్య గొడవలు జరుగుతున్నాయి..ఒకర్నొకరు నిందించుకున్నారు. అయితే అభిజిత్ మొదట నామినేషన్స్‌లోకి వెళ్లగా.. మోనాల్ సేవ్ అయ్యింది. కాగా హారిక తన కెప్టెన్ పవర్ ఉపయోగించి మోనాల్‌ని నామినేట్ చేసి అభిజిత్‌ని సేవ్ చేసింది. మొత్తానికి అభిజిత్ కోసం మోనాల్ త్యాగం చేయాల్సి వచ్చింది...



ఇకపోతే ఈరోజు జరగనున్న ఎపిసోడ్ లో మోనాల్-అభిజిత్ మళ్లీ పాత ట్రాక్‌లోకి వచ్చినట్టే చూపించారు. ఈ ఇద్దరూ ప్రశాంతంగా స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని మాట కలుపుతున్నారు. ‘మోనాల్ నువ్ మా డాడీకి నచ్చావంటే.. ఏంటో.. అబ్బా’ అంటూ అభిజిత్ అనడం.. మోనాల్ ఓరగా చూడటాన్ని చాలా రొమాంటిక్‌గా చూపించారు.. ఈరోజు మళ్లీ వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ చిగురించింది..మొత్తానికి అఖిల్‌తో ట్రాక్ తప్పిన తరువాత మోనాల్ గాలి మళ్లీ అభిజిత్‌ వైపుకి మళ్లినట్టుగా ఈ ప్రోమోలో చూపించారు... హారిక ఏమైపోవాలి.. ఎంటో. ఈ ట్రై యాంగిల్ లవ్ ట్రాక్.. ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: