యూ ట్యూబ్.. ఇప్పుడు ఏ వీడియో కావాలన్నా ఇలా సెర్చ్ చేస్తే అలా కళ్లముందు ప్రత్యక్షమైపోతోంది. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం మీ ముందు వాలిపోతుంది. స‌హ‌జంగా ఇంటర్నెట్ అందుబాటులో లేని ప్రాంతాలకు వెళ్లినపుడు యాప్ సర్వీసులను వినియోగించుకోవటం అనేది దాదాపుగా కష్టతరంగా మారిపోతుంది. ముఖ్యంగా రోజు యూట్యూబ్ వీడియోలను చేసే అలవాటు ఉన్న వారికి ఈ సమస్య చాలా పెద్దదిగా అనిపిస్తుంది. వాస్తవానికి ఇది పెద్ద సమస్యేమి కాదు. కొన్ని సింపుల్ టిప్స్ ను పాటించటం ద్వారా ఇంటర్నెట్‌తో పనిలేకుండా యూట్యూబ్ వీడియోలను వీక్షించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని యూట్యూబ్ యాప్‌ను ఓపెన్ చేసి మీకు కావల్సిన వీడియోను ఓపెన్ చేయండి. వీడియో ఓపెన్ అయిన తరువాత క్రింద భాగంలో Share, Download , Add to పేర్లతో మూడు ఆప్షన్‌లు కనిపిస్తాయి. వాటిలో డౌన్‌లోడ్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే వీడియో డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ కాబడిన వీడియోలను ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ‌న్‌లైన్‌లో వీక్షించవచ్చు. 


- ముందుగా VDYouTube అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. సైట్‌లోకి వెళ్లిన తరువాత యూట్యూబ్ వీడియోకు సంబంధించిన యూఆర్ఎల్ లింక్‌ను సంబంధిత కాలమ్‌లో పేస్ట్ చేసి GO బటన్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత రెడ్ డౌన్‌లోడ్‌ బటన్ పై క్లిక్ చేసి వీడియో ఫార్మాట్‌ను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.


- Windows, macOS ఇంకా Linux ఆధారిత డివైసుల్లో యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే 4K వీడియో డౌన్‌లోడ‌ర్‌ అనే యాప్‌ను మీ డివైసుల్లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ యాప్ కావల్సిన రిసల్యూషన్ క్వాలిటీలో వీడియోలను డౌన్‌లోడ్ చేసి పెడుతుంది. దీనికి ముందుగా 4K వీడియో డౌన్‌లోడ‌ర్‌ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ఇన్ స్టాల్ అయిన తరువాత యూట్యూబ్ వీడియోకు సంబంధించిన యూఆర్ఎల్ ను కాపీ చేసుకుని యాప్ లో పోస్ట్ చేయాలి. తదుపరి స్టెప్ లో భాగంగా రిజ‌ల్యూషన్ ఎంపిక చేసుకుని డౌన్‌లోడ్‌ బటన్ పై క్లిక్ చేసినట్లయితే వీడియో డౌన్ లోడ్ కాబడుతుంది.


చూశారుగా ఎప్పుడైనా యూట్యూబ్ వీడియోలను ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న సమయంలో డౌన్‌లోడ్ చేసుకుని వాటిని ఎప్పుడు కావలంటే అప్పడు ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా వీక్షించవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: