ప్రస్తుతం పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. నిత్యం ఎప్పటికప్పుడు పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇందుకు కారణం సౌదీ అరేబియా చమురు కోతకు సిద్ధమవడం. అంతేకాకుండా ప్రపంచంలో చమురు నిల్వలను ఉత్పత్తి చేసే ఎన్నో దేశాలు ఈ కోతకు సిద్ధమవుతున్నాయి. ఫలితంగా భారతదేశంలో అధికంగా పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలలో చమురు ఉత్పత్తి చేస్తున్న కొన్ని దేశాలు మొన్న  చమురు నిల్వల కోసమై సమావేశమయ్యాయి. అయితే అందరికన్నా ముందుగా సౌదీ అరేబియా చమురు కోతకు సిద్ధమవుతోంది. ఇక ఢిల్లీ విషయానికి వస్తే పెట్రోల్ రేటు ఆల్ టైం హై కి  పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర  రూ.84.70 గా ఉంది. మరి డీజిల్ ధర రూ. 74.88 రూపాయలుగా ఉంది.

పెట్రోల్,డీజిల్ ధరలపై కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికారాన్ని ఛలాయిస్తున్నాయి. దీనికి తోడు జిహెచ్టీ  కిందకు తీసుకురావడంతో ఎవరికి తోచినట్లు వాళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెంచేస్తున్నారు. ఫలితంగా జనవరి 1న ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.83.71 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు జనవరి ఆరవ తేదీన 25 పైసలు పెంచితే,మరోసారి జనవరి 13న 25 పైసలు పెంచారు.

అసలు  వాస్తవానికి లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
వాస్తవానికి లీటర్ పెట్రోల్ ధర 27.31 రూపాయలు.
రవాణా చార్జీలు లీటర్కు 0.37 రూపాయలు
ఎక్సైజ్ డ్యూటీ లీటర్కు 32.98 రూపాయలు
 డీలర్ కమిషన్ లీటర్కు 3.67 రూపాయలు
ఇక వీ ఏ టీ  లీటరుకు 19.32రూపాయలు.
ఇంకా అన్నీ కలిపితే మొత్తానికి లీటర్ పెట్రోల్ ధర 83.71 రూపాయలుగా ఉంది.
ఇక హైదరాబాద్ లో పెట్రోలు ధర లీటర్ కు 88.11 రూపాయలు ఉండగా, విజయవాడ లో మాత్రం 90.57 రూపాయలు గా ఉంది. ఏది ఏమైనప్పటికీ పెట్రోలు డీజిల్ ధరలు పెరిగి సామాన్యులను అష్ట కష్టాలకు గురి చేస్తున్నాయి.ఇక సామాన్యులు పెట్రోలు, డీజిల్ను కొనాలంటేనే ఇబ్బంది పడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: