ఇక చాలా మంది కూడా ఎలాంటి స్మార్ట్ ఫోన్ కొనాలని తిక మక పడుతూ ఉంటారు. ముఖ్యంగా కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనేవాళ్ళు తెగ ఇబ్బంది పడుతూ వుంటారు. ఆల్రెడీ స్మార్ట్ ఫోన్ వాడేవారికి ఏ ఫోన్ కొంటే బాగుంటుందో లేక ఏ ఫోన్ లో మంచి ఫీచర్స్ ఉంటాయి అనేది బాగా ఐడియా ఉంటుంది. ఇక అమెజాన్ ప్రైమ్ లో చాలా ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్ లు కొనుగోలు చేశారు. ఇక ప్రధానంగా 10నగరాల్లో చూసుకున్నట్లయితే 70శాతం మంది కొత్త ప్రైమ్‌ మెంబర్స్‌ మొబైల్ షాపింగ్‌ చేసినట్లు అమెజాన్‌ చెప్పింది. ఇక అందులో ముఖ్యంగా జమ్ము-కాశ్మీర్‌ కు చెందిన అనంతనాగ్‌,జార్ఖండ్ లోని బొకారో అలాగే అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ ఇంకా నాగలాండ్‌ లోని మొకోక్చుంగ్ అలాగే పంజాబ్‌లోని హోషియార్‌పూర్ ఇంకా తమిళనాడులో నీలగిరి అలాగే కర్ణాటకలోని గడగ్ ఇంకా కేరళలోని కాసరగోడ్ ప్రాంతాల ప్రజలు ఎక్కువ మంది  ఈ మొబైల్ ఫోన్స్ కొనుగోళ్లు జరిపినట్లు తేలింది.

ఇక అమెజాన్‌ ప్రైమ్‌ డేలో వన్‌ ప్లస్‌ నార్డ్‌2 5జీ, వన్‌ ప్లస్‌ నార్డ్‌ సీఈ 5జీ అలాగే రెడ్‌ మీ నోట్‌ 10 సిరీస్‌, రెడ్‌మీ 9 ఇంకా శాంసంగ్‌ గెలాక్సీ ఎం 31ఎస్‌, శాంసంగ్‌ గెలాక్సీ ఎం21 ఇంకా రియల్‌మీ సీ11 ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేసినట్లు అమెజాన్‌ తన అధికారిక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. అంతేగాక ఈ ఫోన్స్ ఈ సంవత్సరంలో చాలా బెస్ట్ ఫోన్స్ గా నిలిచాయి. కాబట్టి స్మార్ట్ ఫోన్స్ కొనాలనుకునేవారు ఈ ఫోన్స్ ని కొనడం చాలా మంచిది.ఇక రెండురోజుల పాటు జరిగిన ఈ అమెజాన్ ప్రైమ్‌ డే సేల్‌లో అమెజాన్ ప్రైమ్‌ మెంబర్స్‌ 1.26లక్షల మంది కొనుగోళ్లు చేయగా..31,000 మంది అమ్మకాలు జరిపినట్లుగా .. ఆ అమ్మకాల్లో దాదాపు 25శాతం మంది పైగా రూ.1కోటి పైగా బిజినెస్‌ నిర్వహించినట్లు అమెజాన్‌ ప్రతినిధులు వెల్లడించడం జరిగింది.అలాగే స్మార్ట్‌ ఫోన్లతో పాటుగా వంటగదిలో ఉపయోగించే వస్తువులు భారీ మొత్తంలో కొనుగోళ్లు జరిగినట్లు అమెజాన్‌ తెలిపడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: