ప్రస్తుతం ఉన్న కాలంలో ఎలక్ట్రానిక్ రంగంలో స్మార్ట్ పరికరాలు ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి.ముఖ్యంగా ఇటీవల కాలంలో టీవీలలో ఆండ్రాయిడ్ టీవీలు ఎక్కువగా ప్రజలు ఇష్టపడుతున్నారు.. నెట్ సదుపాయం ఎక్కువగా ఉపయోగించడం వల్ల మొబైల్ కు టీవీ కు కనెక్ట్ చేయాలి అంటే కచ్చితంగా ఆ టీవీ ఆండ్రాయిడ్ కు సపోర్ట్ చేస్తూ ఉండాలి.. అయితే చాలామంది ఇళ్లల్లో పాత టీవీలే ఉన్నాయి అందువల్లే కేబుల్ ప్రసారాలను మాత్రమే ఇలా వీక్షిస్తూ ఉంటారు. కానీ తాజాగా ఎయిర్టెల్ అందించే DTH సర్వీసులతో పాత టీవీ ని కూడా ఆండ్రాయిడ్ టీవీ గా చానల్స్ ను చూడవచ్చట.


ఎయిర్టెల్ డిజిటల్ టీవీ..DTH.. విభాగం వినియోగదారులకు ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ ను ఈ విధంగా అందిస్తోంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ గా సేవలు చాలాకాలంగా అందిస్తూనే ఉంది. మనకు ఇష్టమైన ఓటీటి షోలను చూడడానికి ఇంటర్నెట్ కనెక్షన్తో నేరుగా మన టీవీలోనే యాప్స్ ను యాక్సెస్ చేసుకునే విధంగా సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇందులో 5000 కంటే ఎక్కువ యాప్స్ ని మనం పొందవచ్చు. అలాగే మనకు కావలసినప్పుడు లినియర్ టీవీ కంటెంట్ను కూడా మార్చుకోవచ్చు. స్మార్ట్ మొబైల్ లో స్క్రీన్ కాస్ట్ ఫీచర్ ని ఉపయోగించాలి అంటే ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బాక్స్ క్రోమ్ కాస్ట్ తో కూడా లభిస్తుంది. దీనివల్ల  ఆండ్రాయిడ్ టీవీ9.0 ప్లాట్ ఫామ్ లో రన్ అవుతుంది.అలాగే 4K నాణ్యతతో కూడా చూడవచ్చు.


ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బాక్స్ ధర 1500 రూపాయలు మాత్రమే.. ఎయిర్టెల్ బాక్స్ ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ ద్వారా  అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ సేవలు దాదాపుగా అన్ని ప్రాంతాలలో కూడా అందుబాటులో ఉన్నాయి .ఎయిర్టెల్ బ్లాక్ తో ఒక సర్వీస్ ను కూడా కొనుగోలు చేయవచ్చట. ఈ బాక్స్ యొక్క స్పెసిఫికేసన్ విషయానికి వస్తే..ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ లాంటిది. ఈ బాక్స్ ద్వారా మనం ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్ఫారం కోసం ఉపయోగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: