సాధారణంగా ఎన్నో పుస్తకాలలో తాబేలు-కుందేలు పరుగు పందెం గురించి అందరూ చదివే ఉంటారు. తాబేలు ఎంతో నెమ్మదిగా వెళ్తుంది అని ఆ కథలో రాసి ఉంటుంది. అయితే నెమ్మదిగా వెళ్లినప్పటికీ పట్టువిడవకుండా ఉండడంతో చివరికి తాబేలు విజయం సాధించింది అన్నది కథ సారాంశం. అయితే ఈ కథ చదివినప్పటి నుండి కూడా తాబేలు గుర్తుకు వచ్చింది అంటే చాలు అది ఎంతో నెమ్మదిగా భూమి మీద నడుస్తూ ఉంటుంది అన్న విషయం మాత్రం అందరికీ అర్థమవుతుంది. ఇక కేవలం ఈ కథ ఆధారంగా మాత్రమే కాదు ఇప్పటివరకూ నిజ జీవితంలో తాబేళ్లను చూసుకున్నా కూడా అవి ఎంతో నెమ్మదిగా పాకుతూ వెళ్లడం చూస్తూ ఉంటాము.


 దీంతో తాబేలు అంటే కేవలం నెమ్మదైన నడక మాత్రమే అందరికీ గుర్తుకు వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మాత్రం ఇప్పుడు వరకు మనం విన్న కథలను చూసిన ఘటనలను కూడా ఈ తాబేలు పటాపంచలు చేసేస్తుంది అని చెప్పాలి. ఏకంగా పరుగుల రారాజు హుస్సేన్ బోల్ట్ కి ఛాలెంజ్ విసిరేలాగే ఇక్కడ ఒక తాబేలు ఎంతో వేగంగా పరుగులు పెట్టింది.  ఇది చూసిన వారు ప్రతి ఒక్కరు అవాక్కయ్యారు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో తెగ చక్కెర్లు కొడుతుంది.


 ఇది చూసిన నెటిజన్లు అందరూ కూడా తాబేలు ఇంత వేగంగా పరిగెత్తడం ఏంటి ఇది నిజమేనా ఆశ్చర్యపోతూ ఉండడం గమనార్హం. ఈ వీడియోలో తాబేలు అప్పటి వరకు అందరికీ తెలిసిన విధంగా ఎంతో నెమ్మదిగా నడిచింది. అంతలోనే టాప్ గేర్ అందుకుంది. మెరుపు వేగంతో  పరుగులు తీసి సెకన్ల వ్యవధిలో నీటిలోకి దూకి అదృశ్యం అయింది అని చెప్పాలి. అయితే ఈ తాబేలు వేగంగా కదిలిన తీరు చూసి వీడియో తీసిన వ్యక్తి సైతం అవాక్కయ్యాడు.. ఇప్పుడు ఆ వ్యక్తి వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: